గులాబ్ ఎఫెక్ట్: పొంగిపొర్లుతున్న మూసీ... చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై రాకపోకల నిలిపివేత, భారీగా ట్రాఫిక్ జాం

By Siva KodatiFirst Published Sep 28, 2021, 4:13 PM IST
Highlights

చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై అధికారులు రాకపోకలను నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా మూసీనదిలో వరద ప్రవాహం ఎక్కువైంది. దీంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బ్రిడ్జికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. 
 

చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై అధికారులు రాకపోకలను నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా మూసీనదిలో వరద ప్రవాహం ఎక్కువైంది. దీంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బ్రిడ్జికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు గులాబ్ తుఫాన్ (cyclone gulab) ప్రభావం తెలంగాణ (telangana)రాష్ట్రంపై తీవ్రంగా కన్పించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షం కారణంగా జనజీవనం స్థంబించింది. తెలంగాణలోని 14 జిల్లాలకు వాతావరణ  (IMD)శాఖ రెడ్ అలర్ట్ (Red alert)ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డలో అత్యధికంగా 18.13 సెం.మీ వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాలలో 16.13 సెం.మీ వర్షపాతం రికార్డైంది.సిరిసిల్ల జిల్లా నాంపల్లిలో 15.98 సెం.మీ. వర్షపాతం, ఖమ్మం జిల్లా ఇచ్చోడలో 15.15 సెం.మీ వర్షపాతం నమోదైంది.

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ధర్మారంలో 14.9 సెం.మీ. జమ్మికుంటలో 14.8 సెం.మీ. వీణవంకలో 14.8 సెం.మీ. వైరాలో 14.2 సెం.మీ హైద్రాబాద్ రాజేంద్రనగర్ లో 11.08 సెం.మీ వర్షపాతం నమోదైంది.గులాబ్ తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైద్రాబాద్ నగరంలో కూడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. హైద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడ  పోలీస్ శాఖ అప్రమత్తమైంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కారణంగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. 
 

click me!