మెదక్ లో కలకలం... మహిళను ముక్కలు ముక్కలుగా నరికి..

Published : Nov 02, 2019, 01:42 PM ISTUpdated : Nov 02, 2019, 01:55 PM IST
మెదక్ లో కలకలం... మహిళను ముక్కలు ముక్కలుగా నరికి..

సారాంశం

చనిపోయిన మహిళ వయసు దాదాపు 35 ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. వారం రోజుల క్రితమే ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంపేసి అనంతరం ముక్కలు ముక్కలుగా నరికి ఉంటారని వారు చెబుతున్నారు. అనంతరం పాలిథిన్ కవర్లలో చుట్టి భూమిలో పాతిపెట్టినట్లు తెలుస్తోంది.

మెదక్ జిల్లా ఏడుపాయల టెంపుల్ సమీపంలో తీవ్ర కలకలం రేగింది. పోలీసులకు ఆ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి... పాలిథిన్ కవర్లలో చుట్టి... ఉంచడం గమనార్హం. కాగా... చనిపోయిన మహిళ ఎవరు అనేది ఎవరని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చనిపోయిన మహిళ వయసు దాదాపు 35 ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. వారం రోజుల క్రితమే ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంపేసి అనంతరం ముక్కలు ముక్కలుగా నరికి ఉంటారని వారు చెబుతున్నారు. అనంతరం పాలిథిన్ కవర్లలో చుట్టి భూమిలో పాతిపెట్టినట్లు తెలుస్తోంది.

ఓ వ్యక్తి గుడికి వెళ్తుండగా.... తొలుత వాటిని గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా...వారు అక్కడికి వచ్చి పరిశీలించారు. కాగా... మహిళ శరీర భాగాలు గుడికి 600మీటర్ల దూరంలోనే ఉండటం విశేషం. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ శరీర భాగాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. 

మిస్సింగ్ కేసు ల ఆధారంగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!