ఖమ్మంలో దారుణం : చికిత్స కోసం వచ్చిన మహిళ కిడ్నాప్.. రాత్రంతా అత్యాచారం, చివరికి

Siva Kodati |  
Published : May 02, 2023, 10:06 PM IST
ఖమ్మంలో దారుణం : చికిత్స కోసం వచ్చిన మహిళ కిడ్నాప్.. రాత్రంతా అత్యాచారం, చివరికి

సారాంశం

ఖమ్మంలో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను అపహరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడో ఆటోడ్రైవర్ . సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

ఖమ్మంలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను అపహరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడో ఆటోడ్రైవర్. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండం రామన్నపేట మండలం రామన్నగుట్ట తండాకు చెందిన లీల అనే మహిళ కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె అత్తతో కలిసి ఏప్రిల్ 27న ఖమ్మం ఆసుపత్రికి వెళ్లాలనుకున్నారు. దీనిలో భాగంగా రైలులో ఖమ్మంకు చేరుకుని .. ఆసుపత్రికి వెళ్లేందుకు ఆటోను ఎక్కారు. 

అయితే మార్గమధ్యంలో లీల అత్త మూత్ర విసర్జన కోసం ఆటో దిగింది. ఇదే అదనుగా ఆటోడ్రైవర్ లీలను తీసుకుని వెళ్లిపోయాడు. ఆమెను గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లిన డ్రైవర్ రాత్రంతా ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఉదయాన్ని ఆసుపత్రి వద్ద వదిలిపెట్టి పారిపోయాడు. తీవ్రగాయాలతో వున్న ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ లీల ప్రాణాలు కోల్పోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏప్రిల్ 28వ తేదీన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే