
కల్లు గీత కార్మికుల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రైతు బీమా తరహాలో గీత కార్మికులను కూడా ఆదుకోవాలని ఆయన నిర్ణయించారు.రూ.5 లక్షలు బీమా కల్పించాలని కేసీఆర్ భావించారు. గీత కార్మికులకు వారం రోజుల్లోనే నగదు వారి ఖాతాల్లో జమ చేయాలని ఆయన సూచించారు. అలాగే ఈ పథకానికి విధి విధానాలు ఖరారు చేయాల్సిందిగా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.