తడిసిన ధాన్యానికీ మామూలు వరి ధరే.. రైతాంగానికి కేసీఆర్ గుడ్‌న్యూస్ , నాలుగు రోజులు కోతలు వద్దన్న సీఎం

By Siva KodatiFirst Published May 2, 2023, 9:30 PM IST
Highlights

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.  రాష్ట్రంలో వరి కోతలు 3, 4 రోజులు వాయిదా వేసుకోవాలని కేసీఆర్ సూచించారు. 

అకాల వర్షాలతో అల్లాడుతున్న రైతాంగానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించారు. మంగళవారం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, పంటనష్టం తదితర అంశాలపై అధికారులు, మంత్రులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. దీనికి కూడా సాధారణ వరికి చెల్లించే ధరనే చెల్లిస్తామని సీఎం పేర్కొన్నారు.

రాష్ట్రంలో వరి కోతలు 3, 4 రోజులు వాయిదా వేసుకోవాలని కేసీఆర్ సూచించారు. రైతులు ప్రతి యేటా మార్చిలోగా యాసంగి వరికోతలు పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. వ్యవసాయ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ హెచ్చరించారు. అలాగే క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సీఎస్ కు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు

click me!