ప్రగతి భవన్ వద్ద కలకలం: పారిశుద్య కార్మికురాలు ఆత్మహత్యాయత్నం

By narsimha lode  |  First Published Jul 24, 2020, 5:36 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ఎదుట శుక్రవారం నాడు సాయంత్రం పారిశుద్య కార్మికురాలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ఎదుట శుక్రవారం నాడు సాయంత్రం పారిశుద్య కార్మికురాలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  ఈ విషయాన్ని గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకొన్నారు. ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనే విషయమై ఆరా తీస్తున్నారు.

కూకట్‌పల్లికి  చెందిన పారిశుద్యకార్మికురాలు ప్రగతి భవన్ వద్దకు వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెట్రోల్ పోసుకొంటున్న సమయంలోనే ప్రగతి భవన్ వద్దే  విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకొన్నారు. ఆమెను కూకట్‌పల్లికి తరలించారు పోలీసులు.

Latest Videos

click me!