ఫోన్ మాట్లాడొద్దన్న భర్త.... ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య

Published : Dec 12, 2019, 11:51 AM IST
ఫోన్ మాట్లాడొద్దన్న భర్త.... ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య

సారాంశం

 తరచూ ఫోన్లు మాట్లాడటంతో భర్త మనోహర్ ఆమెను పలు మార్లు మందలించాడు. ఈ విషయంలో భార్య, భర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరిగాయి.  

తరచూ ఫోన్ లో మాట్లాడుతూ... ఇంట్లో వాళ్లని సరిగా పట్టించుకోవడం లేదని ఓ భర్త.. కట్టుకున్న భార్యను మందలించాడు. కాగా... భర్త అలా మందలించడాన్ని తట్టుకోలేకపోయిన సదరు మహిళ... ఇళ్లు వదిలేసి వెళ్లిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...బౌద్ధనగర్ అంబర్ నగర్ కు చెందిన దొంతుల అనురాధ(40) అనే మహిళకు వివాహమై పదేళ్లపైనే అవుతోంది. కాగా... ఆమె ఇటీవల కాలంలో భర్త, సంసారాన్ని పట్టించుకోకుండా తరచూ ఫోన్లు మాట్లాడుతూ గడిపేస్తోంది. తరచూ ఫోన్లు మాట్లాడటంతో భర్త మనోహర్ ఆమెను పలు మార్లు మందలించాడు. ఈ విషయంలో భార్య, భర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరిగాయి.

ఈ క్రమంలో ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం ఫోన్ లో మళ్లీ మాట్లాడుతూ కనిపించింది. దీంతో... భర్త.. ఆమెపై కోప్పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన అనురాధ ఇంట్లో ఫొన్‌ వదిలి వెళ్లిపొయింది. అనురాధ కోసం పలుచోట్ల గాలించిన ఫలితం లేదు. తన భార్య అనురాధ కనిపించటం లేదని భర్త మనోహర్‌ బుధవారం చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ