కాలిపోయిన ఆ మృతదేహం దిశదేనని డిఎన్ఏ నివేదిక తేల్చి చెప్పింది. మరో నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్: షాద్‌నగర్ కు సమీపంలోని చటాన్‌పల్లి అండర్‌పాస్ బ్రిడ్జి వద్ద కాలిన మృతదేహం దిశదేనని తేలింది. డిఎన్ఏ పరీక్షలో ఈ విషయం రుజువైందని అధికారులు తెలిపారు.
షాద్‌నగర్‌కు సమీపంలోని చటాన్‌పల్లి వద్ద గత నెల 28వ తేదీన ఉదయం కాలిపోతున్న మృతదేహన్ని చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహం వద్ద దొరికిన వస్తువుల ఆధారంగా ఈ మృతదేహం దిశదేనని కుటుంబసభ్యులు గుర్తించారు.
undefined
దిశ మృతదేహాన్ని కాల్చివేసిన చటాన్‌పల్లి ప్రాంతంలో సేకరించిన ఎముకలను దిశ కుటుంబసభ్యుల డిఎన్ఏతో పోల్చారు. దిశ కుటుంబ సభ్యుల డిఎన్ఏతో కాలిన మృతదేహం వద్ద దొరికిన డిఎన్ఏ నమూనాలు సరిపోయాయని అధికారులు తెలిపారు.
దిశ మృతదేహనికి సంబంధించిన డిఎన్ఏ నివేదిక సైబరాబాద్ పోలీసులకు అందింది. గత నెల 27వ తేదీన రాత్రి దిశపై నలుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశారు.
శంషాబాద్ టోల్‌గేట్ సమీపంలోని తొండుపల్లి సర్వీస్ రోడ్డుపై దిశపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. దిశపై అత్యాచారానికి పాల్పడిన ప్రాంతంలో దొరికిన లో దుస్తులపై దొరికిన వీర్యకణాలను పోలీసులు సేకరించారు.
వీటిని కూడ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపారు. అంతేకాదు దిశ ఐడీ కార్డు, డెబిట్ కార్డు వంటివాటిని కూడ సేకరించారు. వీటితో పాటు కొన్ని వెంట్రుకలను కూడ పోలీసులు సేకరించారు.
దిశపై అత్యాచారం జరిగిందని నిరూపించేందుకు సంఘటన స్థలంలో దొరికిన ఆధారాలను పోలీసులు డిఎన్ఏ ల్యాబ్ కు పంపారు. ఈ విషయమై ఇంకా డిఎన్ఏ నుండి నివేదిక రాలేదు. ఈ నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.