ఆస్తి గొడవలు.. పిల్లలతో కలిసి భర్త హత్య..!

Published : May 07, 2021, 07:28 AM IST
ఆస్తి గొడవలు.. పిల్లలతో కలిసి భర్త హత్య..!

సారాంశం

పోచమ్మ కాలనీకి చెందిన నారం నారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. గత కొంతకాలంగా కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అది కూడా ఆస్తి విషయంలో అని సమాచారం.


కట్టుకున్న భర్త కలకలం సంతోషంగా ఉండాలని కోరుకోవాల్సిన భార్యే.. కిరాతకంగా ప్రవర్తించింది. తన పసుపు కుంకుమలను తానే దూరం చేసుకుంది. కడుపున పుట్టిన పిల్లల సహాయంతో... భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన కామారెడ్డిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇద్దరు పిల్లలతో కలిసి భర్తను భార్య హత్య చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ పోచమ్మ కాలనీలో చోటుచేసుకుంది. పోచమ్మ కాలనీకి చెందిన నారం నారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. గత కొంతకాలంగా కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అది కూడా ఆస్తి విషయంలో అని సమాచారం.

కాగా.. ఇటీవల నారం నారాయణ ఇంట్లో నిద్రపోతున్న సమయంలో అతని భార్య, ఇద్దరు పిల్లలు కలిసి రాళ్లతో దాడి చేసి చంపేశారు. గత కొన్ని సంవత్సరాలుగా  భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. భూ తగాదా విషయంలో హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!
Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపూర్ కావ‌డం ఖాయం