హుజురాబాద్ నూతన ఎసిపి గా ఉత్తమ పోలీస్ ఉద్యోగి వెంకట్ రెడ్డి

By telugu teamFirst Published May 7, 2021, 6:48 AM IST
Highlights

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎఫెక్ట్ తో హుజూరాబాద్ ఎసీపీ బదిలీ అయినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఎసీపిగా వెంకటరెడ్డి నియమితులయ్యారు. శ్రీనివాస్ ను అక్కడి నుంచి బదిలీ చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా ఈటల రాజేందర్ భూ అక్రమాల వ్యవహారంతో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజురాబాద్ నియోజవర్గంలో ప్రభుత్వం నియోజవర్గంలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లోని అధికారులని మార్చి మొత్తం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. దానిలో భాగంగా హుజురాబాద్ నూతన ఎసిపి గా హైదరాబాద్ సిఐడి విభాగంలో పనిచేస్తున్న డిఎస్పీ వెంకట్ రెడ్డి ని నియమించింది. ఇప్పటికే హుజూరాబాద్ ఎసిపి గా ఉన్న శ్రీనివాస్ ను బదిలీపై డిజిపి ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ కీలక సమయంలో హుజురాబాద్ కొత్త ఏసిపిగా నియమితులైన వెంకట్ రెడ్డి సిఐడి విభాగంలో డిఎస్పీ గా పని చేస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఈ అధికారి ఈ మధ్యే మహిళా భద్రతా విభాగానికి అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ఉత్తమ పోలీస్ ఉద్యోగిగా ప్రశంశలు, ప్రశంశలతో పాటు లక్ష రూపాయల రివార్డ్ కూడా అందుకున్నారు.  సిఐడి విభాగంలో పనిచేస్తూ మహిళా భద్రతా విభాగానికి అటాచ్ లో ఉన్న డిఎస్పీ వెంకట్ రెడ్డి షీ టీమ్స్,

భరోసా టీమ్స్ లాంటి కార్యక్రమాల్లో ప్రజలను చైతన్య పరచటంలో తీవ్ర కృషి చేశారు.  మహిళలను టెక్నాలజీ సహాయంతో వేధించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఎన్నో వందల కేసులను సునాయాసంగా పరిష్కరించారు. మహిళలను వేధించిన వారిని, ఏదైనా ఇబ్బంది పెట్టిన వారిని ఆన్ లైన్ కౌన్సెలింగ్ ద్వారా వారికి సరైన మార్గం చూపెట్టి వారిని మార్చే ప్రయత్నం చేయటం ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్న పేరుంది. అందుకే మహిళా భద్రత విభాగంలో డిఎస్పీ వెంకట్ రెడ్డి మంచి ఉన్నతాధికారిగా పేరు తెచ్చుకున్నారు.

click me!