భార్య వివాహేతర సంబంధం.. భర్త హత్య?

Published : Apr 29, 2020, 07:34 AM IST
భార్య వివాహేతర సంబంధం.. భర్త హత్య?

సారాంశం

వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు వివరించారు. పెళ్లి అయిన నాటి నుంచి భార్యాభర్తల మధ్య పలుసార్లు గొడవలు తలెత్తగా, గ్రామ పెద్దలు సర్దిచెప్పి కాపురం నిలబెట్టడానికి ప్రయత్నించారు.  

ఓ వ్యక్తి అత్యంత దారుణ హత్యకు గురయ్యాడు. కాగా... ఆ హత్యకు అతని భార్యే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. సదరు మహిళకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని.. ఈ కారణంతోనే భర్తను హత్య చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమతౌతున్నాయి. ఈ సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం అన్నారం గ్రామానికి చెందిన జనుముల దేవదాస్‌(35)కి కొన్ని సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన పార్వతి తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు వివరించారు. పెళ్లి అయిన నాటి నుంచి భార్యాభర్తల మధ్య పలుసార్లు గొడవలు తలెత్తగా, గ్రామ పెద్దలు సర్దిచెప్పి కాపురం నిలబెట్టడానికి ప్రయత్నించారు.

వారి ప్రయత్నం కారణంగా ఈ దంపతులు విడిపోకుండా కలిసే ఉంటున్నారు. అనుకోకుండా దేవదాస్ శవమై కనిపించాడు. అత్యంత దారుణంగా...  గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తలకు వైరు బిగించి బండరాళ్లతో కొట్టి చంపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. క్లూస్‌ టీంను రప్పించి వివరాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ఈ హత్య అతని భార్య పార్వతి చేయించిందని పలువురు ఆరోపించడం గమనార్హం.

కాగా..తన కొడుకు హత్యకు కోడలు పార్వతితో పాటు ఆమెతో సన్నిహితంగా ఉండే గడ్డం బాబు కారణమని హతుడి తల్లి లచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్