సేవ చేయడం ఇష్టం లేక.. అత్తను చంపిన కోడలు

Published : Aug 20, 2019, 10:02 AM IST
సేవ చేయడం ఇష్టం లేక.. అత్తను చంపిన కోడలు

సారాంశం

మనసులో ఉంచుకున్న కౌసర్‌ అత్తను అంతమొందించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 30న భర్త ఇంట్లో లేని సమయంలో అత్తపై దాడి చేసి హత్య చేసింది.   

వృద్ధాప్యంలో ఉన్న అత్తకు సేవ చేయడం ఇష్టం లేక... ఓ కోడలు అత్తను దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. కాగా...ఆ హత్యను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించి.. జైలు పాలయ్యింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...బండ్లగూడ హషామాబాద్‌కు చెందిన చాంద్‌పాషా, కౌసర్‌ బేగం భార్యభర్తలు. చాంద్‌పాషా తల్లి ఖైరూన్‌ బేగం (68) వృద్ధాప్య కారణంగా అనారోగ్యంతో బాధ పడుతోంది.

అప్పుడప్పుడు చాంద్‌ పాషా ఇంటికి వచ్చిన సమయంలో కోడలు తనను సరిగ్గా చూసుకోలేదు. ఈ విషయమై ఖైరూన్‌బేగం  కొడుకు, కోడలిని నిలదీసింది. దీనిని మనసులో ఉంచుకున్న కౌసర్‌ అత్తను అంతమొందించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 30న భర్త ఇంట్లో లేని సమయంలో అత్తపై దాడి చేసి హత్య చేసింది. 

ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో ఇంటికి వచ్చిన అతను  గదిలో ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసి అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు బంధువులను నమ్మించి అంత్యక్రియలకు సిద్ధమయ్యాడు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్