24గంటల్లోనే ఇంటి అనుమతి... నిజంగా శుభవార్తే

By telugu teamFirst Published Aug 20, 2019, 8:50 AM IST
Highlights

పట్టణాలు, నగరాల్లో స్థలాల విలువ భారీగా పెరగడం వంటి పరిస్థితుల నేపథ్యంలో చిన్నచిన్న స్థలాల్లోనే ఇళ్లు నిర్మించుకునేందుకు పలువురు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టం ప్రకారం తక్కువ స్థలం ఉండి నిర్మించుకునే ఇళ్లకు ఇబ్బందులు ఉండవు. కొత్తగా వచ్చే స్వీయ దరఖాస్తు విధానం అనేది దరఖాస్తుదారుడిదే పూర్తి బాధ్యుడిని చేస్తుంది. 

సాధారణ, మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు ఓ కళ. దీనిని నిజం చేసుకోవడానికి చాలా మంది వ్యయప్రసాయలు పడుతుంటారు. ఇక ఇంటి నిర్మాణానికి అనుమతి తెచ్చుకోవడం కూడా పెద్ద ప్రయాసతో కూడుకున్న పనే. కానీ ఇక నుంచి ఆ సమస్య లేదు. అతి సులభంగా ఇంటికి అనుమతి తెచ్చుకోవచ్చు. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకురావాలని చూస్తోంది. కేవలం పది రోజుల్లోనే అనుమతులు వచ్చేలా చట్టం తీసుకురావాలని చూస్తోంది.

పట్టణాలు, నగరాల్లో స్థలాల విలువ భారీగా పెరగడం వంటి పరిస్థితుల నేపథ్యంలో చిన్నచిన్న స్థలాల్లోనే ఇళ్లు నిర్మించుకునేందుకు పలువురు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టం ప్రకారం తక్కువ స్థలం ఉండి నిర్మించుకునే ఇళ్లకు ఇబ్బందులు ఉండవు. కొత్తగా వచ్చే స్వీయ దరఖాస్తు విధానం అనేది దరఖాస్తుదారుడిదే పూర్తి బాధ్యుడిని చేస్తుంది. 

ఈ ప్రకారం నిబంధనల మేరకు వ్యవహరించడం తప్పనిసరి. లేదంటే జరిమానా, ఇతర చర్యలకు అవకాశం ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించినట్లు పురపాలకశాఖ గుర్తిస్తే అలాంటి భవనాన్ని నోటీసులు ఇవ్వకుండానే కూల్చేలా చట్టంలో స్పష్టం చేశారు. తప్పుడు వివరాలతో అనుమతి పొందితే వాటిని రద్దు చేసే అధికారం పురపాలకశాఖకు ఉంటుంది.

పాత పురపాలక చట్టం ప్రకారం నిర్మాణదారులు భవన నిర్మాణ అనుమతి తెచ్చుకునేందుకు సదరు మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదు.  అన్ని రకాల పత్రాలు ఉన్నప్పటికీ పురపాలకశాఖలో అధికారులకు ఎంతో కొంత ముట్ట చెప్పాల్సి వచ్చేది. పూర్తి నిబంధనలు పాటించినప్పటికీ రూ.20 వేల నుంచి 25 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. లేకుంటే పలుచోట్ల భవన నిర్మాణ అనుమతి వచ్చే పరిస్థితి లేదు.

కానీ కొత్త చట్టంతో ఇన్ని సమస్యలు ఉండవు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో 75 చదరపు గజాలలోపు స్థలంలో నిర్మించుకునే ఇంటికి అనుమతి అవసరం ఉండదు. కేవలం రూపాయి చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే సరిపోతుంది. సొంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆస్తి పన్నుగా రూ.100 చెల్లిస్తే చాలు. 500 చదరపు మీటర్లు, 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణాలకు నిర్దేశిత పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లోనే అనుమతి పొందే విధానం త్వరలో అమలులోకి రానుంది. అన్నీ సక్రమంగా ఉంటే 24 గంటల్లోనే అనుమతి ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.

అక్రమ నిర్మాణాలు జరగకుండా, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఈ తరహా చట్టాన్ని తీసుకువస్తున్నారు. అన్ని భవన నిర్మాణ అనుమతులు ఆన్‌లైన్‌ కావడంతో ఆన్‌లైన్‌ విధానాన్ని పటిష్ఠం చేయనున్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందించడానికి ఇబ్బందులు లేకుండా సర్వర్‌ వేగంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలకశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల ఆన్‌లైన్‌ పోర్టల్‌ అందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా చేస్తామని స్పష్టం చేశారు

click me!