అక్రమ సంబంధం: భర్తతో కలిసి ప్రియుడిని చంపేసిన మహిళ

By telugu teamFirst Published Mar 11, 2021, 9:25 AM IST
Highlights

సికింద్రాబాదులోని మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన భర్తతో కలిసి ప్రియుడిని మట్టుబెట్టింది. పోలీసులు భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: ఓ ఆటో డ్రైవర్ ను ఆమెను వశపరుచుకున్నాడు. వివాహితను లోబరుచుకున్న ఆటో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. ఓ వ్యక్తి బంధువు బెదిరించి అతని భార్యను లోబరుచుకున్నాడు. దీంతో సహనం కోల్పోయిన మహిళ తన భర్తతో కలిసి అతన్ని హతమార్చింది. ఈ హత్య కేసులో భార్యాభర్తలు పోలీసులకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వివరాలను సికింద్రాబాదులోని మల్కాజిగిరి సిఐ జగదీశ్వర్ రావు వెల్లడించారు. 

సికింద్రాబాదులోని కార్ఖానాకు చెందిన మహ్మద్ ముఖ్రం (25) అవివాహితుడు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతను తన బంధువు మహ్మద్ మజీద్ (36) ఇంటికి తరుచుగా వస్తుండేవాడు. మజీద్ భార్య సల్మా బేగంతో ముఖ్రంకు సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది తెలిసి మజీద్ కుటుంబంతో మౌలాలీలోని షపీనగర్ కు వెళ్లాడు. ముఖ్రం అక్కడికి కూడా వచ్చి వేధించసాగాడు. పరువు పోతుందనే భయంతో ఆమె భరిస్తూ వచ్చింది. 

దాంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. ఈ నెల 6వ తేదీ రాత్రి మౌలాలిలో ఓ కార్యక్రమానికి తల్లిని తీసుకుని వెళ్లి ఆమెను అక్కడ దించేచేసి, పెట్రోల్ పోయించుకుని వస్తానని చెప్పి సల్మాబేగం ఇంటికి వెళ్లాడు. భర్త ఇంట్లో ఉన్నాడని చెప్పినా ఆమెను ముఖ్రం బలవంతపెట్టాడు. దాంతో అతన్ని మంచంపై కూర్చోబెట్టి ముచ్చట చెప్పింది. ఆ తర్వాత అకస్మాత్తుగా అతన్ని వెనక్కి తోసింది. 

భార్య స్క్వార్ఫ్ ను మజీద్ అతని మెడకు చుట్టి బిగించాడు. ముఖంపై దిండు పెట్టి అదిమి ఊపిరాడకుండా చేశాడు. కాళ్లను చేతులను సల్మా బేగం పట్టుకుంది. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత భార్యాభర్తలు పారిపోయారు. తన కుమారుడు ఉదయం వరకు కూడా రాకపోవడంతో ముఖ్రం తల్లి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముఖ్రం కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు అతని ఆచూకీ కనిపెట్టాడు. 

అతను ఎక్కువగా మజీద్ తో మాట్లాడినట్లు తేలడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో కాపు కాసి మౌలాలిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని వారు అంగీకరించారు. దీంతో వారిని బుధవారం రిమాండుకు తరలించారు. వారి ఇద్దరి పిల్లలను బంధువులు తీసుకుని వెళ్లారు.

click me!