డ్రమ్ములో కుక్కి డెడ్ బాడీ చెరువులో: కామారెడ్డిలో మహిళ దారుణ హత్య

Published : Apr 19, 2023, 10:44 AM IST
డ్రమ్ములో  కుక్కి  డెడ్ బాడీ చెరువులో: కామారెడ్డిలో మహిళ  దారుణ  హత్య

సారాంశం

బంగారు ఆభరణాల  కోసం  నర్సవ్వ అనే మహిళను అత్యంత దారుణంగా హత్య  చేశారు. దుండగులు. ఈ ఘటనకు  పాల్పడిన నిందితులను  పోలీసులు అరెస్ట్  చేశారు. 

కామారెడ్డి:  బంగారు ఆభరణాల  కోసం  నర్సవ్వ అనే మహిళను  ముగ్గురు దుండగులు అత్యంత  దారుణంగా హత్య చేశారు. నర్సవ్వను హత్య  చేసిన  నిందితులను  సీసీటీవీ పుటేజీ ద్వారా గుర్తించారు.  ముగ్గురు నిందితులను  పోలీసులు అరెస్ట్  చేశారు.

కామారెడ్డి  జిల్లాలో నర్సవ్వ  అనే  మహిళను  గొంతు నులిమి  హత్య  చేశారు ముగ్గురు నిందితులు.  నర్సవ్వ  ఒంటిపై  ఉన్న  నాలుగు తులాల బంగారం,  10 తులాల వెండిని అపహరించారు  దుండగులు , నర్సవ్వ  మృతదేహన్ని  డ్రమ్ములో  పెట్టి  చెరువులో వేశారు.  గంభీరావుపేట  మండలం కొత్తపల్లి చెరువులో  నర్సవ్వ డెడ్ బాడీని  పారేశారు.  ఈ విషయమై  పోలీసులకు అందిన  ఫిర్యాదు మేరకు   దర్యాప్తు  సాగించారు.  సీసీటీవీ  పుటేజీ  ఆధారంగా   ముగ్గురు నిందితులను  పోలీసులు  గుర్తించారు.   ఈ ముగ్గురు నిందితులను  పోలీసులు అరెస్ట్  చేసి విచారించారు. నర్సవ్వను హత్య చేసినట్టుగా  నిందితులు  ఒప్పుకున్నారు. నర్సవ్వ  మృతదేహన్ని డ్రమ్ములో  పెట్టి  చెరువులో  వేసినట్టుగా  నిందితులు పోలీసులకు  చెప్పారు.   మృతదేహన్ని  పోలీసులు  చెరువు నుండి బయటకు తీశారు. మృతురాలు నర్సవ్వది రామారెడ్డి  మండలం అన్నారం గ్రామం.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions
Telangana: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం