బీఆర్ఎస్- ఐ ప్యాక్‌ల మధ్య తెగిన బంధం.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..

Published : Apr 19, 2023, 10:24 AM IST
బీఆర్ఎస్- ఐ ప్యాక్‌ల మధ్య తెగిన బంధం.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..

సారాంశం

ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ  ప్యాక్) దేశంలో పలు రాజకీయ పార్టీల కోసం పనిచేస్తుంది. తెలంగాణలో కూడా గత కొంతకాలంగా బీఆర్ఎస్‌తో కలిసి ఐ ప్యాక్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. 

హైదరాబాద్‌: ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యుహాకర్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అతనికి అనుబంధంగా ఉన్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ  ప్యాక్) దేశంలో పలు రాజకీయ పార్టీల కోసం పనిచేస్తుంది. గత ఏడాది ఆరంభం నుంచి తెలంగాణలో బీఆర్‌ఎస్‌‌‌తో ఐ ప్యాక్ కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతేడాది ఏప్రిల్‌లో ప్రశాంత్ కిషోర్‌ హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్, కేటీఆర్‌లతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఐ ప్యాక్ టీమ్స్ కూడా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్‌ కోసం సర్వేలు నిర్వహించాయి. ఆ నివేదికలను బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు అందజేశాయి. తెలంగాణలో ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్‌తో కలిసి ఐ ప్యాక్ కలిసి పనిచేయనుందని కూడా అంతా భావించారు. 

అయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్‌తో ఐ ప్యాక్ కలిసి పనిచేయడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది.  తాజాగా ఈ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయడం లేదని కేటీఆర్ చెప్పారు. బీఆర్‌ఎస్‌తో ఐ ప్యాక్ ఒప్పందాన్ని ముగించుకున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.

ఇక, ఐ ప్యాక్ టీమ్ చివరిగా గతేడాది  నవంబర్‌లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల కోసం బీఆర్ఎస్‌తో కలిసి పనిచేసింది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ తన సొంత టీమ్‌తో ఐటీ వింగ్, సోషల్ మీడియాప్రచారాన్ని నిర్వహిస్తోంది. అయితే బీఆర్ఎస్‌- ఐ ప్యాక్‌ల మధ్య ఒప్పందం ముగియడానికి గల  కారణాలు మాత్రం వెల్లడికాలేదు. ఇదిలా ఉంటే..  ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు. ప్రస్తుతం తన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?