ఎల్బీనగర్‌లో సిలిండర్ పేలుడు, పలువురికి గాయాలు

Published : May 10, 2019, 11:18 AM IST
ఎల్బీనగర్‌లో సిలిండర్ పేలుడు, పలువురికి గాయాలు

సారాంశం

హైద్రాబాద్ ఎల్బీనగర్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ దాటికి మూడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో కొంతమందికి గాయాలైనట్టుగా సమాచారం అందింది.

హైదరాబాద్: హైద్రాబాద్ ఎల్బీనగర్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ దాటికి మూడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో కొంతమందికి గాయాలైనట్టుగా సమాచారం అందింది.

ఎల్బీనగర్‌లోని గుంటి జంగయ్యనగర్‌లో సమీప జిల్లాల నుండి వచ్చి నివాసం ఉంటున్నారు. గుడిసెలు వేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.  శుక్రవారం ఉదయం పూట ఈ గుడిసెల్లో సిలిండర్ పేలుడు చోటు చేసుకొంది. సిలిండర్‌లో గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొందని స్థానికులు చెప్పారు.దీంతో గుడిసెల్లో మంటలు చేలరేగాయి. మంటల ధాటికి గుడిసెల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడ పేలాయి.

భారీగా పేలుడు శబ్దం వెలువడడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.  పక్కనే ఉన్న గుడిసెలకు కూడ ఈ మంటలు వ్యాపించాయి.. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.   అగ్నిమాపక సిబ్బంది ఈ ప్రాంతంలో మంటలను ఆర్పారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన వారిని కామినేని ఆసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

విద్యార్థుల‌కు అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణ‌.. జ‌పాన్‌తో యంగ్‌ ఇండియా స్కిల్స్ వ‌ర్సిటీ ఒప్పందం
RTC: ఇక కండ‌క్ట‌ర్‌తో ప‌ని లేదు.. మీ టికెట్ మీరు తీసుకోవ‌చ్చు. ఆర్టీసీలో స‌రికొత్త ప్ర‌యోగం