
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి కిడ్నాప్ అయ్యింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. స్థానిక దేవరకొండ బస్తీలోని రోడ్ నెం. 3లో ద్విచక్ర వాహనాల్లో వచ్చిన ముగ్గురు దుండగులు యువతిని కిడ్నాప్ చేశారు.
ఆమెను బలవంతంగా బైకుమీద ఎక్కించడంతో ఆ యువతి సాయం చేయాంటూ కేకలు వేసింది. ఆ కేకలువిన్న స్థానికులు ఇళ్ల నుంచి బైటికి వచ్చి చూసే లోపే దుండగులు పరారయ్యారు.
దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనమీద కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజీల ఆధారంగా కిడ్నాప్ మీద ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.