తెలంగాణ కరోనా అప్ డేట్: ఆ జిల్లాల్లో భారీగా కేసులు... ఐదువేలకు చేరిన యాక్టివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Mar 31, 2021, 09:50 AM ISTUpdated : Mar 31, 2021, 09:51 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: ఆ జిల్లాల్లో భారీగా కేసులు... ఐదువేలకు చేరిన యాక్టివ్ కేసులు

సారాంశం

సోమవారం రాత్రి 8గంటల నుండి మంగళవారం రాత్రి 8గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 56,122మందికి కరోనా టెస్టులు చేయగా 684మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో(సోమవారం రాత్రి 8గంటల నుండి మంగళవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 56,122మందికి కరోనా టెస్టులు చేయగా 684మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,07,889కు చేరితే టెస్టుల సంఖ్య 1,01,51,609కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 394మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,01,227కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,965 యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 1,873గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1697కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.55శాతంగా వుంటే దేశంలో ఇది 1.3శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 94.1శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.83శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 6,, నాగర్ కర్నూల్ 9, జోగులాంబ గద్వాల 3,  కామారెడ్డి 6, ఆదిలాబాద్ 12, భూపాలపల్లి 5, జనగామ 6, జగిత్యాల 19, అసిఫాబాద్ 6, మహబూబ్ నగర్ 23, మహబూబాబాద్ 6, మెదక్ 8, నిర్మల్ 30, నిజామాబాద్ 48,  సిరిసిల్ల 7, వికారాబాద్ 8, వరంగల్ రూరల్ 6,  ములుగు 5, పెద్దపల్లి 9, సిద్దిపేట 13, సూర్యాపేట 16, భువనగిరి 17, మంచిర్యాల 13, నల్గొండ 24 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 184కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 61, రంగారెడ్డి 45, కొత్తగూడెం 6, కరీంనగర్ 23, ఖమ్మం 17,  సంగారెడ్డి 21, వరంగల్ అర్బన్ 17కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు: 

 


 

PREV
click me!

Recommended Stories

Congress VS Janasena : గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత | Asianet News Telugu
రేవంత్‌ సూపర్ స్పీచ్ | CM Revanth Reddy In Parade Grounds | Telangana Formation Day | KCR