కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకిన యువతి.. దుర్గం చెరువులో కొనసాగుతున్న గాలింపు చర్యలు..

Published : Sep 28, 2022, 05:45 PM ISTUpdated : Sep 28, 2022, 06:08 PM IST
కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకిన యువతి.. దుర్గం చెరువులో కొనసాగుతున్న గాలింపు చర్యలు..

సారాంశం

హైదరాబాద్‌లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి ఓ యువ‌తి నీళ్లలోకి దూకింది. ఇది గమనించిన కొందరు లేక్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన లేక్ పోలీసులు.. యువతి ఆచూకీ కోసం దుర్గం చెరువులో గాలింపు చేపడుతున్నారు. 

హైదరాబాద్‌లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి ఓ యువ‌తి నీళ్లలోకి దూకింది. ఇది గమనించిన కొందరు లేక్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన లేక్ పోలీసులు.. యువతి ఆచూకీ కోసం స్పీడ్ బోట్లతో దుర్గం చెరువులో గాలింపు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న సివిల్ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే నీళ్లలో దూకే సమయంలో యువతి.. తన చెప్పులు, హ్యాండ్ బ్యాగ్‌ను బ్రిడ్జిపైనే వదిలేసినట్టుగా తెలుస్తోంది. 

వాటి ఆధారంగా యువతి పేరు స్వప్నగా గుర్తించారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. బ్యాగ్‌లో దొరికిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ను బట్టి స్వప్న కొంతకాలంగా డిప్రెషన్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మానసిక ఒత్తిడి భరించలేక ఆత్మహత్యకు యత్నించినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి దుర్గం చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యువతి ఆచూకీని గుర్తించేందుకు పోలీసులు గజ ఈతగాళ్ల సాయం కూడా తీసుకుంటున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?
Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.