సీఎం సారూ... మా కుటుంబాలను ఆదుకొండి..: మహిళా హోంగార్డు ఆవేదన

రవీందర్మ ఆత్మహత్య తర్వాత తమ కష్టాలను బయటపెడుతూ హోంగార్డులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.  బాన్సువాడకు చెందిన ఓ మహిళా హోంగార్డ్ తన కష్టాలను వివరిస్తూ వీడియో బయటపెట్టారు. 

Google News Follow Us

నిజామాబాద్ : సకాలంలో జీతం అందక, ఉన్నతాధికారుల వేధింపులతో హైదరాబాద్ లో హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటనను మరిచిపోకముందే మరో మహిళా హోంగార్డ్ కూడా తమ కష్టాలను బయటపెడుతూ కన్నీటిపర్యంతం అయ్యారు. ఉద్యోగపరంగా, వ్యక్తిగతంగా అనేక కష్టాలను ఎదుర్కొంటున్నానని... దయచేసి తమ కుటుంబాలను ఆదుకోవాలంటూ మహిళా హోంగార్డు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. హోంగార్డులను పర్మినెంట్ చేయాలని సీఎంను కోరారు హోంగార్డు నాగమణి. 

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పోలీస్ హోంగార్డుగా పనిచేస్తున్న నాగమణి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆత్మహత్య చేసుకున్న రవీందర్ లాగే ప్రతీ హోంగార్డు బాధలు వున్నాయని... కానీ చాలామంది వృత్తిపరమైన, వ్యక్తిగత బాధలు బయటకు చెప్పుకోలేకపోతున్నారని నాగమణి అన్నారు.రవీందర్ భార్య అనుభవిస్తున్న బాధనే తానుకూడా అనుభవిస్తున్నానని నాగమణి అన్నారు. 

తన భర్త సాయికుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని... అతడి పరిస్థితి చాలా విషమంగా వుందని హోంగార్డు నాగమణి తెలిపారు. దీంతో కుటుంబపోషణ భారం తనపై పడిందన్నారు. తనకు వచ్చి జీతంతోనే కుటుంబాన్ని పోషించుకోవడం, పిల్లలను చదివించుకోవాల్సి వస్తోందన్నారు. పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించడానికి కూడా ఇబ్బంది పడుతున్నానని నాగమణి ఆవేదన వ్యక్తం చేసింది.   

Read More  కర్నూల్‌లో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సత్యనారాయణ: పోలీసుల దర్యాప్తు

 ఇక వృత్తిపరంగా చూసుకుంటే పోలీస్ శాఖలో పరిచేస్తున్నామనే మాటే తప్పహోంగార్డుల బ్రతుకులకు విలువే లేకుండా పోయిందన్నారు నాగమణి. కాబట్టి సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ హోంగార్డులను పర్మినెంట్ చేయాలని నాగమణి కోరారు. ఈ పని చేస్తే తమ జీవితాల్లో వెలుగులు నింపినట్లేనని... జీవితాంతం కేసీఆర్ ఫోటో ఇంట్లో పెట్టుకుని బ్రతుకుతామని హోంగార్డ్ నాగమణి పేర్కొన్నారు. 

ఇదిలావుంటే హైదరాబాద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హోంగార్డ్ రవీందర్ ఇవాళ మృతిచెందాడు. అనేక సమస్యలతో సతమతం అవుతున్న రవీందర్ గోషామహల్ కమాండెంట్ హోంగార్డు కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దాదాపు 60 శాతం శరీరం కాలిపోయి చికిత్స పొందుతున్న అతడు శుక్రవారం మృతిచెందాడు. అయితే తన భర్తది ఆత్మహత్య కాదు హత్య  అంటూ రవీందర్ భార్య సంచలన కామెంట్స్ చేసారు.