శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డ 2కిలోల బంగారం

Published : Dec 27, 2020, 10:59 AM IST
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డ 2కిలోల బంగారం

సారాంశం

దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికురాలిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా 2.021 కిలోల బంగారం పట్టుబడింది.

హైదరాబాద్: దుబాయ్ నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికురాలిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా 2.021 కిలోల బంగారం పట్టుబడింది. ఈ బంగారానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

మహిళ వద్ద లభించిన బంగారం బిస్కెట్ల రూపంలోనే కాకుండా నగల రూపంలో వున్నట్లు అధికారులు తెలిపరు. కస్టమ్స్ అధికారుల అదుపులో వున్న నిందితురాలిని విచారిస్తున్నారు. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.96.04 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

TASK: విద్యార్థుల‌కు టెక్ స్కిల్స్‌లో శిక్ష‌ణ‌.. డెల్ కంపెనీతో ప్ర‌భుత్వం కీల‌క ఒప్పందం
Weather Update : బంగాళాఖాతంలో తుపాను లోడింగ్... ఇక కాస్కొండి, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలే