తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 472 పాజిటివ్ కేసులు, 509 మంది రికవరీ

Arun Kumar P   | Asianet News
Published : Dec 27, 2020, 09:50 AM ISTUpdated : Dec 27, 2020, 10:04 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 472 పాజిటివ్ కేసులు, 509 మంది రికవరీ

సారాంశం

తెలంగాణలో తాాజాగా అతి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 

హైదరాబాద్: తెలంగాణలో తాజాగా చాలా తక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో(శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8 గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 37,347మందికి టెస్టులు చేయగా 472మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,84,863కి చేరగా టెస్టుల సంఖ్య 67,23,710కి చేరింది. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 509 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,76,753కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 6,579యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1531కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 95.8శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.15శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే నారాయణపేట 1, కామారెడ్డి 6, జోగులాంబ గద్వాల 6, ఆదిలాబాద్ 7, భూపాలపల్లి 7, జనగామ 2, జగిత్యాల 8, వనపర్తి 4, అసిఫాబాద్ 2, మహబూబ్ నగర్ 6, మహబూబాబాద్ 12, మెదక్ 7, నాగర్ కర్నూల్ 6,  నిర్మల్ 3, నిజామాబాద్ 10,  సిరిసిల్ల 8, వికారాబాద్ 3, వరంగల్ రూరల్ 7,  ములుగు 7, పెద్దపల్లి 10, సిద్దిపేట 17, సూర్యాపేట 9, భువనగిరి 13, మంచిర్యాల 19, నల్గొండ 23 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 106కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 45, రంగారెడ్డి 44, కొత్తగూడెం 15, కరీంనగర్ 17, ఖమ్మం 16,  సంగారెడ్డి 8, వరంగల్ అర్బన్  18కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:

 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu