
నిర్మల్ : బంధాలు, అనుబంధాలు నేటి రోజుల్లో చిన్న విషయాలుగా మారిపోయాయి. కోపం వస్తే.. ఇబ్బంది పెడితే మరో ఆలోచన లేకుండా.. సమస్యకు ఇంకో పరిష్కారమే లేదన్నట్టుగా హత్యల దాకా వెళ్లి పోతున్నారు. కట్టుకున్న భర్త అయినా, కన్న కొడుకైనా ఇదే నియమం.. అలా ఓ భార్య భర్తను సుపారీ గ్యాంగ్ తో చంపించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
తన మెడలో తాళి కట్టి మరో మహిళతో extramarital affair ఏర్పరచుకున్న భర్తను.. భార్య supari gangతో murder చేయించిన ఉదంతమిది. నిర్మల్ డిఎస్పి ఉపేందర్రెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుచానూరు ప్రాంతానికి చెందిన కంచర్ల శ్రీనివాస్ (42) అనాధ. ఉపాధి కోసం hyderabad కు వచ్చాడు. తొలుత auto నడిపేవాడు. ఆ క్రమంలో ఉప్పల్ ప్రాంతంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేసే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటకు చెందిన స్వప్నతో పరిచయం ఏర్పడింది.
ఇద్దరూ ఇష్టపడి ప్రేమించుకుని.. వివాహం చేసుకున్నారు. స్వప్నకు ఇదివరకే వివాహమై ఒక కుమారుడు (రాజకుమార్) జన్మించాక.. విడాకులు తీసుకుంది. శ్రీనివాస్, స్వప్న దంపతులకు వివాహం తరువాత ఒక కుమారుడు (తరుణ్), కుమార్తె జన్మించారు. ఆ తరువాత స్నేహితుల సాయంతో real estate వ్యాపారంలోకి శ్రీనివాస్ అడుగుపెట్టాడు.
ఉప్పల్, వేంపేట్ లలో ఇల్లు నిర్మించాడు. ఈ క్రమంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఆమెతోపాటు కలిసి ఉందాం అంటూ తరచూ భార్యను వేధించసాగాడు. ఆ వేధింపులు భరించలేక అతన్ని చంపేస్తే సమస్య పరిష్కారం అవుతుందని స్వప్న భావించింది. ఇటీవల కుటుంబ సభ్యులు వేంపేటకు వచ్చారు. ఇదే అదనుగా భావించిన స్వప్న తరుణ్, రాజ్ కుమార్ లతో పాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన తన అక్క కుమారుడు పోశెట్టిలతో కలిసి శ్రీనివాస్ ను చంపాలనుకున్నట్లు చెప్పింది.
సుపారీ గ్యాంగ్ తో చేయిద్దామని పోశెట్టి తన తమ్ముడు చిక్కా అలియాస్ ప్రవీణ్ కుమార్ ను వేంపేటకు పిలిపించాడు. ఈ నెల 22న రాత్రి మెదక్, జగిత్యాల జిల్లాలకు చెందిన బాణాల అనిల్, కంచర్ల మహావీర్, మ్యాతరి మధు, కొలనూరు సునీల్, పొన్నం శ్రీకాంత్, పూసల రాజేందర్ లతో 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో నిద్రపోతున్న శ్రీనివాస్ ను రోకలిబండతో దాడి చేసి హత్య చేశారు. మృతుడి ఒంటిపై ఉన్న ఒక బంగారు ఆభరణాలు లాక్కుని వారు వెళ్లిపోయారు.
నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలం సమీపంలోని మృతదేహాన్నిపోశెట్టి, రాజ్ కుమార్, చిక్కా లు పడేశారు. ఈ కేసును ఛేదించిన లక్ష్మణ్ చందా పోలీసులు మొత్తం పదమూడు మందిని నిందితులుగా గుర్తించారు. పది మందిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు డిఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 73 గ్రాముల బంగారు ఆభరణాలు, హత్యకు ఉపయోగించిన రోకలిబండ తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.