ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం: తెలంగాణ వాణి వినిపించండి... ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం

Siva Kodati |  
Published : Jan 30, 2022, 07:25 PM IST
ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం: తెలంగాణ వాణి వినిపించండి... ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం

సారాంశం

ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) అధ్యక్షతన ప్రగతి భవన్‌లో (pragathi bhavan) జరిగిన టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ (trs parliamentary party meeting) స‌మావేశం ముగిసింది. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో (parliament budget session 2022) అనుస‌రించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు

ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) అధ్యక్షతన ప్రగతి భవన్‌లో (pragathi bhavan) జరిగిన టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ (trs parliamentary party meeting) స‌మావేశం ముగిసింది. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో (parliament budget session 2022) అనుస‌రించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. అలాగే.. రాష్ట్రానికి చెందిన అంశాల‌పై ఎంపీల‌తో ముఖ్యమంత్రి చ‌ర్చించారు. కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాల‌పై కేసీఆర్ పలు సూచనలు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన అంశాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం నివేదిక రూపొందించింది.. ఈ సందర్భంగా దానిని సీఎం కేసీఆర్ ఎంపీల‌కు అంద‌జేశారు. రాష్ట్ర హ‌క్కులు, ప్ర‌యోజ‌నాల కోసం కృషి చేయాల‌ని ఆయన ఆదేశించారు. పార్ల‌మెంట్‌లో తెలంగాణ వాణి బ‌లంగా వినిపించాల‌ని ఎంపీల‌కు కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. 

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పార్ల‌మెంట్‌లో గ‌ట్టిగా పోరాడాలని... తెలంగాణ‌కు కేంద్రం చేసిందేమీ లేదని తెలిపారు. చ‌ట్ట‌ప‌రంగా, న్యాయ‌ప‌రంగా రావాల్సిన‌వి కూడా రాలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత ఎంపీ రంజిత్ రెడ్డి (ranjith reddy) మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బ‌డ్జెట్ చూసిన త‌ర్వాత దానికి అనుగుణంగా తాము స్పందిస్తామన్నారు. కేంద్రం దృష్టికి సీఎం ఇప్ప‌టికే ప‌లు అంశాలు తీసుకెళ్లారని రంజిత్ రెడ్డి తెలిపారు. 23 అంశాల‌తో కూడిన నివేదిక‌ను సీఎం ఎంపీలకు ఇచ్చారని... విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌పై ఎక్కువ‌గా దృష్టి సారిస్తామని రంజిత్ రెడ్డి వెల్ల‌డించారు.

కాగా.. జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు  (Parliament Budget session 2022) ప్రారంభం కానున్నాయి. గతేడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో అనుసరించిన క‌రోనా ప్రోటోకాల్‌ల మాదిరిగానే అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న పార్ల‌మెంట్ వ‌ర్గాలు.. బ‌డ్జెట్ స‌మావేశాల‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేసిన‌ట్టు వెల్ల‌డించారు. కాగా, ఈ బ‌డ్జెట్‌-2022 స‌మావేశాలు రెండు విడత‌లుగా జ‌ర‌గ‌నున్నాయి. జనవరి 31వ తేదీ నుంచి  ఫిబ్రవరి 11 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. మ‌ళ్లీ మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడుత‌ల బడ్జెట్ సమావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. 

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో (Parliament Budget session 2022) భాగంగా లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లు ఒకే రోజు రెండు వేర్వేరు షిప్టుల్లో ప‌నిచేస్తాయ‌ని పార్ల‌మెంట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రాజ్య‌స‌భ‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లేదా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశమవుతుందని తెలిపాయి. జ‌న‌వ‌రి 31వ‌ తేదీన ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ప్ర‌సంగించ‌నున్నారు. రాష్ట్రప‌తి ప్ర‌సంగం అనంత‌రం స‌భ వాయిదా ప‌డుతుంది. 

ఆ త‌ర్వాతి రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ బ‌డ్జెట్‌-2022ను ప్ర‌వేశ‌పెడుతారు. కేంద్ర బడ్జెట్ 2022ను  ఫిబ్రవరి 1 (మంగళవారం) ఉదయం 11 గంట‌ల‌కు పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెడుతారు. బడ్జెట్ ప్రజెంటేషన్ వ్యవధి 90 నుండి 120 నిమిషాల వరకు ఉండే అవ‌కాశం ఉంది. కాగా, 2020 బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా  నిర్మ‌లా సీతారామన్ భారత చరిత్రలో సుదీర్ఘంగా 160 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇక ఫిబ్రవరి 2 నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాజ్యసభ సమావేశం కానుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభ సమావేశం జ‌రగ‌నుంది. 

PREV
click me!

Recommended Stories

చైనీస్ మాంజాపై సజ్జనార్ కొరడా | Sajjanar Strong Warning on Chinese Manja Sales | Asianet News Telugu
Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu