గద్వాల ప్రభుత్వాసుపత్రిలో ఆటోలోనే మహిళ ప్రసవం.. వీడియో వైరల్.. కానీ...

By SumaBala BukkaFirst Published May 19, 2022, 9:03 AM IST
Highlights

తెలంగాణలోని గద్వాల జిల్లాలో పురుటి కోసం వచ్చిన ఓ మహిళ ఆటోలోనే ప్రసవించింది. దీనికి ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు రాగా, దీన్ని సిబ్బంది ఖండించారు. వివరాల్లోకి వెడితే... 

గద్వాల :  Government Hospital ఆవరణలోనే ఆటోలో మహిళ ప్రసవించింది. అయితే, దీనికి ఆస్పత్రి Medical staff నిర్లక్ష్యమే కారణమంటూ Social mediaలో ఓ వీడియో వైరల్ అయ్యింది.  ఇందుకు సంబంధించి బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... గద్వాల పట్టణానికి చెందిన అరుణ అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో  కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం 5.10 గంటలకు ఆటోలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆవరణలోనే 30 నిమిషాల పాటు ఆటోలోనే ఉన్నా సిబ్బంది సరిగా స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ఉదయం 5.42 నిమిషాలకు ఆటోలోనే గర్భిణీ ప్రసవించినా ఎవరూ స్పందించలేదని వాపోయారు.

ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అంటూ కొందరు ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అప్పుడు స్పందించారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపర్డెంట్ కిషోర్ కుమార్ స్పందిస్తూ తమ సిబ్బంది నిర్లక్ష్యం లేదు అన్నారు. ఆస్పత్రికి వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించాలన్నారు. గర్భిణీ వచ్చే సమయానికే పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ఆటోలోనే ప్రసవించిందన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నతమైన సేవలు అందిస్తున్నామని.. ఇలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. 

ఇదిలా ఉండగా, ఈ ఏప్రిల్ 27న ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఇలాంటి ఆస్పత్రి నిర్లక్ష ఘటనే ఒకటి జరిగింది.  Uttar Pradeshలోని లక్నోలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. nurse నిర్లక్ష్యానికి ఓ పసికందు ప్రాణం పోయింది. నర్సు చేతిలోంచి  జారిపోయి అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందాడు. చింతన్ ప్రాంతంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఓ మహిళ baby boyకు జన్మనిచ్చింది. అయితే  Towel సాయం లేకుండా శిశువును నర్సు ఒంటి చేత్తో ఎత్తుకోవడంతో ఆ శిశువు జారి కింద పడిపోయింది. దీంతో తలకు గాయమై మృతి చెందింది. ఇది చూసి తల్లి ఆర్తనాదాలు పెట్టడంతో భయాందోళనకు గురైన కుటుంబీకులు డెలివరీ రూమ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. 

అయితే వారిని అడ్డుకున్న ఆసుపత్రి సిబ్బంది.. మృత శిశువు జన్మించిందని  బుకాయించే ప్రయత్నం చేశారు. శిశువు  ఆరోగ్యంగానే పుట్టాడని, నర్సు తప్పిదంవల్లే కిందపడి మృతి చెందినట్లు సదరు తల్లి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలకు గాయం కారణంగానే శిశువు మరణించినట్లు నివేదికలో వెల్లడయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు.

కాగా, తెలంగాణలోని మంచిర్యాలలో 11 నెలల పసికందును దారుణంగా చంపేశాడో కన్నతండ్రి. మంచిర్యాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రే అనుమానంతో ఓ చిన్నారి ఉసురు తీశాడు. భార్య మీద అనుమానంతో కడుపున పుట్టిన కొడుకునే 11నెలల చిన్నారిని పాశవికంగా నేలకేసి కొట్టాడు. పట్టరాని కోపంలో చేసిన ఆ పనితో ఆ పసివాడికి నూరేళ్లు నిండాయి. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త విచక్షణ కోల్పోయి భార్య చేతిలో ఉన్న పసికందును నేలకేసి కొట్టి ప్రాణాలు పోయేలా చేశాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పులిమడుగు గ్రామంలో జరిగింది. 

click me!