Telangana: హైదరాబాద్‌లో క్యాబ్స్, ఆటోల బంద్ .. ఆ చ‌ట్టాన్ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్

By Rajesh KFirst Published May 19, 2022, 6:02 AM IST
Highlights

Telangana:  ఒక్కోరోజు ఆటో, క్యాబ్ డ్రైవర్ల బంద్‌ కారణంగా బుధవారం అర్ధరాత్రి నుంచి సిటీలో ఎలాంటి క్యాబ్స్, ఆటోలు, లారీ సర్వీసులు నిలిచిపోనున్నాయి. న్యూ మోటర్ వెహికల్ యాక్ట్ 2019పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న జరిమానాలను  వ్యతిరేకిస్తూ డ్రైవర్స్‌ యూనియన్ జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది.
 

Telangana: డ్రైవర్స్‌ జేఏసీ చేపట్టిన బంద్‌తో బుధవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లో ఆటో(Auto)లు, క్యాబ్‌లు(cabs), లారీలు(lorrys) సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం 2019 అమలు చేస్తూ జరిమానాల పేరుతో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లను నిలువు దోపిడీ చేస్తోంద‌ని  డ్రైవర్స్ జేఏసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. న్యూమోటర్ వెహికల్ చట్టం (New Motor Vehicle Act)2019ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఒక్క రోజు వాహనాల బంద్‌కు ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్స్‌ యూనియన్‌ ఐకాస పిలుపునిచ్చింది.
  
 అంతే కాకుండా.. ఫిట్‌నెస్ లేట్ ఫీజు పేరుతో రోజుకు 50రూపాయలు వసూలు చేయ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు డ్రైవర్లు. తమపై ఇలాంటి అదనపు భారం మోపడకూడ‌ద‌ని, నూత‌న వెహికిల్ చ‌ట్టాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ట్రాన్స్‌పోర్టు భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌ వరకు భారీ ర్యాలీని చేప‌ట్టనున్నారు. తమ నిరసన తెలియజేస్తామని ప్రకటించింది.

బుధవారం హిమాయత్‌నగర్‌లోని ఐకాస కన్వీనర్‌ వెంకటేశం మాట్లాడుతూ.. పెరిగిన ఇంధన ధరల వల్ల  తీవ్రంగా న‌ష్ట‌పోతున్నామ‌నీ, దీనికి తోడు.. అదనపు భారం మోపడాన్ని సమాజ‌సం కాద‌నీ, ఈ క్ర‌మంలో ఒక్క రోజు బంద్ లో  క్యాబ్‌, ఆటో, లారీ డ్రైవ‌ర్స్ లు ట్రాన్స్‌పోర్టు భవన్‌ ముట్టడికి పాలొన్న‌టార‌ని తెలిపారు. ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌ వరకు భారీ ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేస్తామన్నారు. ఈ ర్యాలీలో ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్‌ఐఎఫ్‌, క్యాబ్‌, ఆటో, లారీ సంఘాలు బంద్‌లో పాల్గొంటాయని పేర్కొన్నారు.  

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఒక్కోరోజు ఆటో, క్యాబ్ డ్రైవర్ల బంద్‌ కారణంగా బుధవారం అర్ధరాత్రి నుంచి సిటీలో ఎలాంటి క్యాబ్స్, ఆటోలు, లారీలు అందుబాటులో ఉండవు. కాబట్టి నగరపౌరుల‌కు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్ ప‌రిధిలో ప్రత్యేక బ‌స్సుల‌ను  ఏర్పాట్లు చేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచే ముఖ్యమైన మార్గాల్లో ప్రయాణికుల అవసరాల మేరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు గ్రేటర్‌ జోన్‌ ఈడీ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. బస్సుల కోసం 9959226160, 9959226154 నంబర్లకు సంప్ర‌దించ‌గ‌ల‌ర‌ని ఆర్టీసీ తెలిపింది. 

click me!