లవ్ మ్యారేజ్ చేసుకుందని.. కూతురికి బలవంతంగా అబార్షన్..!

Published : Sep 08, 2021, 08:06 AM IST
లవ్ మ్యారేజ్ చేసుకుందని.. కూతురికి బలవంతంగా అబార్షన్..!

సారాంశం

ప్రస్తుతం సునీత 8 నెలల గర్భిణీ. విశ్రాంతి అవసరం కావడంతో రవికుమార్ ఆమెను తమ బంధువుల ఇంటి వద్ద ఉంచారు. సునీత తల్లి వెంకటమ్మ, అక్క సరిత మంగళవారం ఆమె వద్దకు వెళ్లారు

వద్దని చెప్పినా వినకుండా.. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిపట్ల ఓ తల్లి.. దారుణంగా ప్రవర్తించింది.  కూతురికి బలవంతంగా అబార్షన్ చేయించింది. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జంగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన సునీత(19) అదే గ్రామానికి చెందిన రవికుమార్ (23) ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. అయినా వారు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సునీత 8 నెలల గర్భిణీ. విశ్రాంతి అవసరం కావడంతో రవికుమార్ ఆమెను తమ బంధువుల ఇంటి వద్ద ఉంచారు. సునీత తల్లి వెంకటమ్మ, అక్క సరిత మంగళవారం ఆమె వద్దకు వెళ్లారు. ఆస్పత్రిలో చూపిస్తానని నమ్మించి ఆటోలో తీసుకువెళ్లారు.

ఈ విషయం తెలియటంతో రవికుమార్ అనుమానం వచ్చి ఉర్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు, సునీత బంధువు ఒకరు కల్వకుర్తిలో నర్సుగా పనిచేస్తారు. అదే ఆస్పత్రికి తీసుకువెళ్లి ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు అక్కడికి వెళ్లగా సునీతకు ఆపరేషన్ చేసి బిడ్డను తొలగించిన విషయం వెలుగు  చూసింది. సునీత తల్లి, సోదరి, శస్త్ర చికిత్స చేసిన వైద్యురాలు డా. శ్రీవాణి ఇందుకు సహకరించిన నర్సుతో పాటు మరో ఆరుగురు బంధువులపై పోలీసులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బాధితురాలి తల్లి, సోదరిని రిమాండ్ కు తరలించామని ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. వైద్యురాలితోపాటు మిగతావారు పరారీలో ఉన్నారని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu