24 గంటల్లో 298 కేసులు.. తెలంగాణలో 6,60,142కు చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Sep 07, 2021, 11:12 PM IST
24 గంటల్లో 298 కేసులు.. తెలంగాణలో 6,60,142కు చేరిన సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 298 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 325 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,476 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 68,097 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 298 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,60,142కు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనా వల్ల ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3,888కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 325 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ ల సంఖ్య 6,50,778కి చేరింది. ప్రస్తుతం తెలంగాణాలో 5,476 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 6, జీహెచ్ఎంసీ 89, జగిత్యాల 11, జనగామ 7, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 2, కామారెడ్డి 2, కరీంనగర్ 24, ఖమ్మం 18, మహబూబ్‌నగర్ 6, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 4, మంచిర్యాల 6, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 21, ములుగు 3, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 17, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 1 , పెద్దపల్లి 7, సిరిసిల్ల 4, రంగారెడ్డి 14, సిద్దిపేట 5, సంగారెడ్డి 5, సూర్యాపేట 7, వికారాబాద్ 1, వనపర్తి 5, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్ 21, యాదాద్రి భువనగిరిలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి.


 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే