
కోతులకు భయపడి ఓ యువతి భవనం పై నుంచి కిందపడ చనిపోయింది. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్ జిల్లా భట్టుపల్లి రోడ్డులోని ఐటీడీఏ యూత్ శిక్షణ కేంద్రంలో..జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నాగర్లపల్లి గ్రామానికి చెందిన గంజి శిరీష(24) మూడు కోర్సులను అభ్యసిస్తోంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం భవనంపైకి వెళ్లి మిగితా అభ్యర్థులతో కలిసి ఆమె షటిల్ ఆడుతోంది.
ఇంతలోనే ఓ కోతుల గుంపు రావడంతో భయపడి అందరూ పరుగులు తీశారు. శిరీష పరుగెత్తే క్రమంలో భవనం మొదటి అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. ఆమె తల, నడుముకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.