రేపు నిశ్చితార్థం.. యువతి ఆకస్మిక మృతి

Published : Jul 08, 2021, 07:32 AM ISTUpdated : Jul 08, 2021, 12:17 PM IST
రేపు నిశ్చితార్థం.. యువతి ఆకస్మిక మృతి

సారాంశం

కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నానని యువతి కూడా చాలా ఆనంద పడింది. కానీ ఆ ఆనందం ప్రమాదం రూపంలో వచ్చి ఆవిరి చూసేసింది. రేపు నిశ్చితార్థం అనగా.. యువతి ప్రాణాలు కోల్పోయింది. 

ఆమెకు పెళ్లి కుదిరింది. సంబరంగా చేయాలని కుటుంబసభ్యులు ఆశపడ్డారు. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నానని యువతి కూడా చాలా ఆనంద పడింది. కానీ ఆ ఆనందం ప్రమాదం రూపంలో వచ్చి ఆవిరి చూసేసింది. రేపు నిశ్చితార్థం అనగా.. యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట జయశంకర్ కాలనీ కి చెందిన జెట్టూరి శేఖర్, సత్తమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు రోజా, శ్వేతా, ఒక కుమారుడు నవీన్ ఉన్నారు. శేఖర్.. సీసీఐలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

పెద్ద కుమార్తె రోజా(24) ఎమ్మెస్సీ చదివి ఫార్మసీ కోర్సు చేసింది. కూకట్ పల్లిలోని అనన్య ఆస్పత్రి సమీపంలో అద్దెకు ఉంటూ శామీర్ పేటలోని లాల్ గడి మలక్ పేటలోని ఓ ల్యాబ్ లో పనిచేస్తోంది. వికారాబాద్ లోని మిషన్ ఆస్పత్రి వైద్యుడితో వివాహం చేయాలని నిర్ణయించారు.

బుధవారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ముందు రోజు కొత్త దుస్తుల కోసం స్నేహితురాలు మౌనికతో కలిసి డిజైనర్ వద్దకు వెళ్లింది. ఆమె లేకపోవడంతో దుకాణం ముందు ఎదురుచూస్తోంది. ఆ సమయంలో మూడో అంతస్తు నుంచి పెద్ద రెయిలింగ్ లు వచ్చి ఆమె తలపై పడ్డాయి. దీంతో.. తీవ్ర గాయాలై ఆమె అక్కడికక్కడే చనిపోవడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Vande Bharat Sleeper Train : హైదరాబాద్ టు డిల్లీ లగ్జరీ ట్రైన్ జర్నీ.. వందే భారత్ స్లీపర్ ప్రత్యేకతలివే
IMD Cold Wave Alert : చలి నుండి ఉపశమనం మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ గజగజలాడించే చలి, పొగమంచు ఎక్స్ట్రా