ఎస్సై ఫిర్యాదు: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు

By telugu teamFirst Published Jul 8, 2021, 7:25 AM IST
Highlights

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి పదవీబాధ్యతల సందర్భంగా కాంగ్రెసు కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. దానిపై ఆ కేసు నమోదైంది.

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంద్రభంగా బుధవారం కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. 

కార్యకర్తలు ర్యాలీ నిర్వహించడం ద్వారా చాలా ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్ చేశారని, రాకపోకలకు అంతరాయం కలిగించారని జూబ్లీహిల్స్ ఎస్సై యాకన్న ఫిర్యాదు చేశారు. దీంతో రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

కాగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి ఆయన పిసీసీ అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నారు. 

తీవ్రమైన మల్లగుల్లాలు పడిన తర్వాత కాంగ్రెసు అధిష్టానం రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. దీనిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. 

click me!