హైదరాబాదులో దారుణం : దుస్తుల్లేకుండా మహిళ శవం, రేప్ చేసి చంపేశారని అనుమానం

By SumaBala BukkaFirst Published Jan 10, 2022, 7:29 AM IST
Highlights

వేరే చోట మహిళను హత్య చేసి ఇక్కడ శవాన్ని పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళపై దుండగులు అత్యాచారం చేసి ఉంటారని భావిస్తున్నారు. అత్యాచారం చేసి చంపేసి ఉండవచ్చునని అనుకుంటున్నారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు రాజేంద్రనగర్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. దుస్తులు లేకుండా ఓ మహిళ dead body కనిపించింది. ఈ సంఘటనపై Narsing police కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు. దాంతో ముఖం కనిపించడం లేదు. దాంతో మహిళను గుర్తించడం కష్టంగా మారింది.

వేరే చోట మహిళను murder చేసి ఇక్కడ శవాన్ని పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళపై దుండగులు rape చేసి ఉంటారని భావిస్తున్నారు. అత్యాచారం చేసి చంపేసి ఉండవచ్చునని అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, నిరుడు నల్గొండలో ఇలాంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లాలో పట్టపగలే కామాంధులు రెచ్చిపోయారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామంలో పట్టపగలు అత్యంత ఘోరమైన సంఘటన జరిగింది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న 54 ఏళ్ల వయస్సు గల మహిళను ఇద్దరు వ్యవసాయ కూలీలు ఇంట్లోకి లాక్కెళ్లి, వివస్త్రను చేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. 

నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను అదే గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్య, పుల్లయ్యలుగా గుర్తించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో రోడ్డు వెళ్తున్న మహిళను ఇద్దరు నిందితులు ఇంట్లోకి లాక్కెళ్లి  దారుణానికి ఒడిగట్టినట్లు నల్లగొండ రూరల్ ఎస్సై రాజశేఖర్ రెడ్డి చెప్పారు. మహిళపై అత్యాచారం చేసిన తర్వాత నిందితులు పారిపోయారు. 

పారిపోయే క్రమంలో వారికి మహిళ మరిది కనిపించాడు. ఆమె రోడ్డు మీద పడి ఉందని వారు అతనికి చెప్పారు. వారు చెప్పిన చోటికి అతను వెళ్లాడు. అయితే, వదిన కనిపించలేదు. దాంతో అతను లింగయ్య ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ ఆమెకు వదిన శవం కనిపించింది. తలపై, ఒంటిపై తీవ్రమైన గాయాలు అయినట్లు గుర్తించాడు. 

అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఒంటిపై ఉన్న నాలుగు తులాల బంగారం గాజులు, మూడు తులాల పుస్తెలతాడు అక్కడే పడి ఉన్నాయి. దాంతో నిందితులు దొంగతనం కోసం ఆ దారణానికి ఒడిగట్టలేదని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో వారు ఈ దారుణానికి పాల్పడినట్లు భావించారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 

మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులకు నేరప్రవృత్తి ఉందని, గతంలో కూడా వారు నేరాలు చేశారని చెబుతున్నారు. 

కాగా, ముషంపల్లి ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుగుతుందని  సెస్టెంబర్ 23న మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. దుండగులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ తరహా ఘటనలపై ప్రజల్లో స్పందన రావాలని ఆయన పిలుపునిచ్చారు. ముషంపల్లి ఘటనపై  గ్రామ ప్రజల స్పందన ఇతరులకు మార్గదర్శనం కావాలని ఆయన విజ్ణప్తి చేశారు.

click me!