కట్నం వేధింపులకు మహిళా కానిస్టేబుల్ బలి

By sivanagaprasad KodatiFirst Published Aug 20, 2018, 12:07 PM IST
Highlights

కట్నం వేధింపులు మహిళా కానిస్టేబుల్ ను సైతం బలితీసుకుంది. పెళ్లైన మూడు నెలలకే లోకాన్నివిడిచిపెట్టి వెళ్లిపోయింది. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా కడెంలో జరిగింది. కడెం పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నగుగ్లావత్‌ మధురేఖ పోలీస్ క్వార్టర్స్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. 

నిర్మల్: కట్నం వేధింపులు మహిళా కానిస్టేబుల్ ను సైతం బలితీసుకుంది. పెళ్లైన మూడు నెలలకే లోకాన్నివిడిచిపెట్టి వెళ్లిపోయింది. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా కడెంలో జరిగింది. కడెం పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నగుగ్లావత్‌ మధురేఖ పోలీస్ క్వార్టర్స్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. 

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన మదన్, లక్ష్మీ దంపతుల కుమార్తె మధురేఖ. మధరేఖకు, నిర్మల్‌ జిల్లా పెంబి మండలానికి చెందిన గుగ్లావత్‌ శ్రీనివాస్‌తో 3 నెలల క్రితం వివాహమైంది. మధురేఖ తొలుత లక్సెట్టిపేట్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసి నెలన్నర క్రితం  బదిలీపై కడెం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. 

విధులకు హాజరుకావాల్సిన మధురేఖ స్టేషన్‌కు రాకపోవడంతో హోంగార్డు శాంత ఆమె క్వార్టర్స్‌కు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో ఉన్న మధురేఖను చూసింది. వెంటనే ఎస్సై ముజాహిద్ కు సమాచారం అందించి ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మధురేఖ మృతిచెందినట్లు తెలిపారు. 

అల్లుడి వేధింపులు భరించలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాజ రక్షణకోసం పరితపించే రక్షక భటురాలికే ఇలాంటి కష్టం వస్తే సామాన్యు మహిళ పరిస్థితి ఏంటని సర్వత్రా చర్చ జరుగుతుంది.  

click me!