హైద్రాబాద్‌లో విచారణ పేరుతో తల్లీ కూతుళ్లతో ఎస్ఐ వివాహేతర సంబంధం

By narsimha lodeFirst Published Feb 18, 2020, 8:06 AM IST
Highlights

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తల్లీ, కూతుళ్లతో ఎస్ఐ వివాహేతర సంబందం కొనసాగించాడు. బాధిత కుటుంబం చేసిన ఫిర్యాదును తొక్కిపెట్టాడు. చివరకు సైబరాబాద్ ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో విచారణ సాగుతోంది.

హైదరాబాద్:పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు ఓ ఎస్ఐ. మహిళతో పాటు ఆమె కూతురితో కూడ సన్నిహితంగా ఉన్నాడు. ఈ విషయమై బాధితురాలు ఫిర్యాదు చేసినా కూడ ఆ కేసు బయటకు రాకుండా అతను తొక్కిపెట్టాడు. చివరకు సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.

Also read:హైద్రాబాద్‌లో బ్రిడ్జిపై నుండి కారు బోల్తా: ఒకరు మృతి, నలుగురికి గాయాలు

కొంత కాలం క్రితం మాదాపూర్ జోన్ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఓ వివాహిత ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చింది. ఆమెకు న్యాయం చేస్తామని స్టేషన్ ఎస్ఐ ఆమెను నమ్మించాడు. 

ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామనే క్రమంలో తరచూ ఆమెతో ఫోన్‌లో మాట్లాడేవాడు. ఈ కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేస్తున్నట్టుగా ఆమెను నమ్మించాడు. అతని మాటలను నమ్మిన బాధితురాలు అతడికి రూ. 5 లక్షలు కూడ ఇచ్చింది.

ఇదే క్రమంలో ఎస్ఐ ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు.అంతేకాదు ఆమెతో వివాహేతర సంబంధాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. బాధితురాలిని వివాహం చేసుకొంటానని కూడ నమ్మించాడు. బాధితురాలి ఇంటికి తరచూ వచ్చేవాడు. 

కేసు దర్యాప్తు కోసం తరచుగా ఆమె ఇంటికి వెళ్లేవాడు. కేసు విచారణ కోసం వస్తున్నాడని భావించి కుటుంబసభ్యులు కూడ అనుమానించలేదు. ఈ క్రమంలోనే బాధిత మహిళ తల్లితో కూడ ఎస్ఐ వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు.అయితే కొంత కాలం తర్వాత వీరిద్దరి ప్రవర్తనపై కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది.

కుటుంబసభ్యులు బాధితురాలిని నిలదీస్తే అసలు విషయం ఆమె చెప్పింది. దీంతో పెళ్లి విషయమై ఎస్ఐను ప్రశ్నించారు. మోసపోయినట్టుగా బాధితురాలు గ్రహించింది. ఇదే విషయమై బాధితురాలు అదే పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

చాలా రోజుల తర్వాత కేసు నమోదైంది. కానీ, ఈ కేసు విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తన పలుకుబడిని ఉపయోగించి కేసును ఎస్ఐ నీరుగార్చేందుకు ప్రయత్నించారని బాధిత కుటుంబం ఆరోపించింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ శంషాబాద్ జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నతాధికారులకు ఈ విషయమై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐపై పోలీసు బాస్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై శాఖపరమైన చర్యలకు రంగం సిద్దం చేశారు. అయితే పోలీసు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించినప్పటి నుండి ఎస్ఐ విధులకు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది.

click me!