టీఆర్ఎస్‌ను వీడే ఆలోచన లేదు: జూపల్లి కృష్ణారావు

By narsimha lodeFirst Published Feb 3, 2020, 3:38 PM IST
Highlights

టీఆర్ఎస్ ను వీడే ఆలోచన తనకు లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. 


కొల్లాపూర్: తాను టీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.సోమవారం నాడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు.

తాను టీఆర్ఎస్‌ను వీడీ కాంగ్రెస్‌లో చేరుతానని సాగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను పార్టీని వీడుతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన ఖండించారు.

Also read:కొల్లాపూర్‌లో జూపల్లికి షాక్: మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిదే పై చేయి

కొల్లాపూర్‌లో రెబెల్స్‌గా గెలిచినవారంతా మొదటి నుండి తన వెంటే పార్టీలో ఉన్నవారేనని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలోనే తాను ,పనిచేస్తానని జూపల్లి కృష్ణారావు చెప్పారు. తాను పార్టీని వీడుతాననే దుష్ప్రచారాన్ని మానాలని ఆయన కోరారు. 

కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని కాదని తన వర్గానికి చెందిన అభ్యర్థులను జూపల్లి కృష్ణారావు బరిలోకి దింపారు. రెబెల్స్ ను పోటీ నుండి విరమించుకోవాలని పార్టీ నాయకత్వం తేల్చి చెప్పింది. అయితే  రెబెల్స్ బరిలో నిలిచారు. అయితే ఈ విషయమై మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకొన్నా కూడ జూపల్లి కృష్ణారావు వర్గం బరిలోనే నిలిచింది.

కొల్లాపూర్ మున్సిపాలిటీలో  11 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.  జూపల్లి కృష్ణారావు వర్గానికి చెందిన సభ్యుల సహకారం లేకుండానే అయితే కొల్లాపూర్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం  చేసుకొంది.దీంతో జూపల్లి కృష్ణారావు పార్టీని వీడుతారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారం నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు సోమవారం నాడు స్పందించారు. 

click me!