కూర విషయంలో టెక్కీ దంపతుల మధ్య గొడవ.. భార్య ఆత్మహత్య

Published : Sep 25, 2020, 10:51 AM IST
కూర విషయంలో టెక్కీ దంపతుల మధ్య గొడవ.. భార్య ఆత్మహత్య

సారాంశం

 రాత్రి వండుకోవాల్సిన కూర విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తీవ్రంగా మారడంతో భర్త బెడ్‌రూమ్‌లోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. హర్షిణి పిలిచినా అతడు తలుపు తీయకపోవడంతో ఆందోళన చెందిన ఆమె ఉరేసుకుంది. 

కూర వండే విషయంలో.. భార్యభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు విషాదాంతమైంది. భార్యతో తలెత్తిన వివాదానికి మనస్థాపానికి గురై వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన బుధవారం రాత్రి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాగా.. మృతిరాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... . నగరానికి చెందిన  హర్షిణి(32), ఆమె భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. హైదరాబాద్ లోని హైదర్షాకోట్ లో నివసిస్తున్నారు. వీరికి గత ఏడాది డిసెంబర్‌లో వివాహమైంది. కరోనా నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. రాత్రి వండుకోవాల్సిన కూర విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తీవ్రంగా మారడంతో భర్త బెడ్‌రూమ్‌లోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. హర్షిణి పిలిచినా అతడు తలుపు తీయకపోవడంతో ఆందోళన చెందిన ఆమె ఉరేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు