హైద్రాబాద్ వాసులకు గుడ్‌న్యూస్: ప్రారంభమైన సిటీ బస్సులు

By narsimha lodeFirst Published Sep 25, 2020, 10:24 AM IST
Highlights

హైద్రాబాద్ నగరంలో సిటీ బస్సులు శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. ఆరు మాసాల తర్వాత హైద్రాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరుగుతున్నాయి. మొత్తం బస్సుల్లో కేవలం 25 శాతం బస్సులను మాత్రమే నడుపుతున్నారు. 

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో సిటీ బస్సులు శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. ఆరు మాసాల తర్వాత హైద్రాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరుగుతున్నాయి. మొత్తం బస్సుల్లో కేవలం 25 శాతం బస్సులను మాత్రమే నడుపుతున్నారు. 

కరోనాను పురస్కరించుకొని ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ఈ  ఏడాది  మే 19వ  తేదీ నుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించారు. అయితే సీటీ బస్సులను నడపడం లేదు.

సిటీ బస్సులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో రైళ్లను ఈ నెల మొదటివారంలో ప్రారంభించారు. సిటీ బస్సులను కూడ నడపాలనే డిమాండ్  నెలకొనడంతో ఇవాళ ఉదయం నుండి సీటీ  బస్సులను నడుపుతున్నారు. ప్రతి డిపో నుండి 35 బస్సులను నడుపుతున్నారు.

శుక్రవారం నాడు ఉదయం నుండి బస్సులు ప్రారంభమయ్యాయి.  నగరంలో 1500  బస్సులు మాత్రమే నడుపుతున్నారు. ప్రధాన రూట్లలోనే బస్సులను తిప్పాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకొంది. పటాన్ చెరు-చార్మినార్, ఉప్పల్-హయత్ నగర్,గచ్చిభౌలి- దిల్‌సుఖ్ నగర్, చార్మినార్, జూపార్క్, ఎల్బీనగర్, చింతల్, బీహెచ్ఈఎల్, కూకట్ పల్లి ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నారు.

also read:హైద్రాబాద్ వాసులకు గుడ్‌న్యూస్:శివారు ప్రాంతాలకు బస్సులు ప్రారంభం

 వారం రోజుల తర్వాత పరిస్థితుల్లో మార్పులు వస్తే బస్సుల సంఖ్య ను పెంచనున్నారు.  అంతరాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్దరించనున్నారు. కర్ణాటక, మహరాష్ట్రలకు కూడ అంతరాష్ట్ర బస్సులను పునరుద్దరించనున్నారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం కేసీఆర్ తో గురువారం నాడు భేటీ అయ్యారు. 

సిటీ బస్సుల రాకపోకలకు సంబంధించి చర్చించారు. అంతరాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్దరణపై కూడ చర్చించారు. ఈ రెండింటికి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు.బుధవారం నుండి నగర శివారు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన విషయం తెలిసిందే.
 

click me!