భర్తను వదిలేసి ప్రియుడితో పరార్.. అతను నగలు తీసుకొని..!

Published : Aug 27, 2021, 09:33 AM IST
భర్తను వదిలేసి ప్రియుడితో పరార్.. అతను నగలు తీసుకొని..!

సారాంశం

 పూజితకు అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ శ్రీకాంత్‌రెడ్డితో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. 

ఆమె కట్టుకున్న భర్తను మోసం చేసింది. ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసింది. భర్త లేని సమయంలో.. ప్రియుడితో పరారైంది. ఆ ప్రియుడు.. ఆమె వద్ద దగ్గర ఉన్న నగలను తీసుకొని ఆమెను వదిలేశాడు. దీంతో.. అవమాన భారం భరించలేక.. ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన  నిర్మల్ జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండలం బోరిగాం గ్రామంలో ఈ విషాదం జరిగింది. గ్రామానికి చెందిన కోడూరు పోతన్న (30), పూజిత భార్యాభర్తలు. వీరికి కుమారుడు అభినయ్‌, కూతుళ్లు రితీష, క్యూటీ (3) ఉన్నారు. పోతన్న వ్యవసాయం చేస్తాడు. పూజితకు అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ శ్రీకాంత్‌రెడ్డితో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. 


ఇటీవలే పూజిత భర్త పోతన్నకు తెలియడంతో భార్యను మందలించాడు. ఈనెల 22న భర్తకు చెప్పకుండానే పూజిత, క్యూటీని ఎత్తుకొని శ్రీకాంత్‌తో కలిసి వెళ్లిపోయింది. పూజిత-శ్రీకాంత్‌ రెండు రోజుల పాటు ఆర్మూర్‌, నిజామాబాద్‌లో ఉన్నారు. బుధవారం నిర్మల్‌ బస్టాండ్‌కు చేరుకోగానే ఆమె వద్ద ఉన్న నగలు, డబ్బును శ్రీకాంత్‌ తీసుకొని, ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అతడి కోసం ఎదురుచూస్తూ, ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్విచాఫ్‌ రావడంతో తనను శ్రీకాంత్‌ మోసం చేశాడని గ్రహించింది. 

బుధవారం రాత్రి నిర్మల్‌లోని ఓ లాడ్జి వద్ద కూతురు క్యూటీతో పురుగుల మందు తాగించి, తానూ తాగింది. ఇద్దరూ కింద పడిపోయి అపస్మారక స్థితికి చేరడంతో స్థానికులు గుర్తించి పోలీసుల సాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం క్యూటీ మృతిచెందింది. పూజిత పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు అవమాన భారంతో పోతన్న, ఊరు శివారులోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీయించారు. శ్రీకాంత్‌ రెడ్డి పరారీలో ఉన్నాడు.  

PREV
click me!

Recommended Stories

Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...
CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu