పెళ్లికాని వారికి నో ఎంట్రీ.. బోర్డు ఎత్తేశారుగా..!

Published : Aug 27, 2021, 07:35 AM IST
పెళ్లికాని వారికి నో ఎంట్రీ.. బోర్డు ఎత్తేశారుగా..!

సారాంశం

ఈ ఆరోపణలు నిజమనే వాదన ఎక్కువగా వినపడుతోంది. ఈ నేపథ్యంలో ఇందిరా పార్క్ ఇన్ ఛార్జ్ సత్యతేజ.. పెళ్లి కాని జంటలకు నిషేధం అంటూ బోర్డు పెట్టించారు.

పెళ్లికాని జంటలకు ప్రవేశం లేదంటూ ఇటీవల ఇందిరా పార్క్ లో  ఆ పార్క్ మేనేజ్మెంట్ పేరిట బోర్డు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఆ బోర్డును తొలగించారు. ఈ బోర్డుపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. దానిని తాజాగా తొలగింారు. ఈ పార్క్ ఉదయం, సాయంత్రం నడక కోసం వందల మంది వస్తూ ఉంటారు.

మధ్యాహ్న సమయంలో పెళ్లి కాని యువతీ యువకులు వస్తూ ఉంటారు. రాత్రి చీకటి మాటున వ్యభిచారులు  తిష్టవేస్తున్నారని.. సెక్యురిటీ గార్డులే వారికి కాపలా కాస్తున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమనే వాదన ఎక్కువగా వినపడుతోంది. ఈ నేపథ్యంలో ఇందిరా పార్క్ ఇన్ ఛార్జ్ సత్యతేజ.. పెళ్లి కాని జంటలకు నిషేధం అంటూ బోర్డు పెట్టించారు.

రెండు రోజుల తర్వాత ఈ బోర్డు విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆ బోర్డు తీయించారు. దీనిపై ఉన్నతాధికారులు వివరణ కోరినట్లు తెలుస్తోంది. అయితే.. సదరు పార్క్ మేనేజ్మెంట్ సరైన వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?