నీ భర్తని వదిలేసి.. నాతో రా! మహిళా సీఐకి వేధింపులు

By telugu news teamFirst Published Jun 5, 2020, 7:19 AM IST
Highlights

కాటారంలో విధుల్లో చేరినప్పటి నుంచి మూడేళ్లుగా నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌, వరంగల్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌కు ప్రశాంతి ఫిర్యాదు చేశారు.

ఆమె ఉన్నత పదవిలో ఉంది. పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి ఉద్యోగిని పట్ల ఉన్నతాధికారి కన్ను పడింది. ఆమెను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. ఆమెకు అప్పటికే పెళ్లి అయ్యిందన్న విషయం తెలిసి కూడా వేధించడం మొదలుపెట్టాడు. భర్తను వదిలేసి రావాలంటూ ఒత్తిడి చేశాడు. తన దగ్గరకు వచ్చేస్తే ప్రమోషన్ కూడా ఇస్తానంటూ ఆశ పెట్టాడు. ఈ సంఘటన భూపాలపల్లిలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భూపాలపల్లి ఎక్సైజ్‌ సూపరిటెండెంట్‌ తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ కాటారం ఎక్సైజ్‌ సీఐ ప్రశాంతి ఆరోపించారు. కాటారంలో విధుల్లో చేరినప్పటి నుంచి మూడేళ్లుగా నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌, వరంగల్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌కు ప్రశాంతి ఫిర్యాదు చేశారు.

‘నా క్వార్టర్‌ పక్కనే నీకు క్వార్టర్‌ ఇప్పిస్తా. ఇక్కడే ఉంటూ డ్యూటీ చేయ్‌. అవసరమైతే భూపాలపల్లి ఇన్‌చార్జి సీఐ పోస్టు కూడా నీకే ఇప్పిస్తా’ అంటూ తనపై ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఒత్తిడి తెచ్చారని వాపోయారు. ‘నా భర్తకు కూడా ఉద్యోగం ఉంది.. నాకు పాప ఉంది.వాళ్లను వదిలి ఇక్కడెలా ఉంటాను సార్‌..’ అని ఆయనకు తాను చెప్పినప్పటికీ.. ‘ఏం అయితది.. పాపతో ఇక్కడే ఉండు..’ అని తనకు ఇబ్బంది కలిగించేలా మాట్లాడారని ఆరోపించారు. 

రాత్రి వేళల్లో స్వయంగా పాట పాడి దానిని తన వాట్సా్‌పలో పెట్టే వారని, మొదట్లో ఆయన బుద్ధి తెలియక ‘బాగుంది సార్‌’ అని రిప్లయ్‌ ఇచ్చానని, అప్పటి నుంచి పనికి మాలిన పాటలను పోస్టు చేస్తూ వెకిలిచేష్టలకు దిగుతున్నారని ఆరోపించారు. అకారణంగా కానిస్టేబుల్‌ ముందు తిట్టడమే కాకుండా రాత్రివేళలో సరిహద్దు గ్రామాల్లో దాడులకు వెళ్లాలని ఆర్డర్‌ ఇస్తారని సీఐ చెప్పారు. ఇంత రాత్రి అక్కడికి వెళ్లాలా? అంటే.. ‘నిన్ను ఎవడైనా ఎత్తుక పోతాడా?’ అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నాడని వాపోయింది.

ఈ మేరకు ఆమె ఎక్సైజ్ సూపరిటెండెంట్ పై కలెక్టర్ కి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుని స్వీకరించిన అధికారులు దర్యాప్తు చేస్తామని చెప్పారు.

click me!