తెలంగాణలో సెంచరీ కొట్టిన కరోనా మరణాలు: 24 గంటల్లో 127 కేసులు, 3,147 చేరిన సంఖ్య

By Siva KodatiFirst Published Jun 4, 2020, 9:42 PM IST
Highlights

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 127 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో కోవిడ్ 19 కేసుల సంఖ్య 3,147కి చేరుకుంది

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 127 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో కోవిడ్ 19 కేసుల సంఖ్య 3,147కి చేరుకుంది.

గురువారం మరో ఆరుగురు వైరస్ కారణంగా మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 105కి చేరింది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 110, ఆదిలాబాద్‌లో 7, రంగారెడ్డిలో 6, మేడ్చల్‌లో 2, సంగారెడ్డి, ఖమ్మంలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

Also Read:తెలంగాణలో 45 మంది వైద్యులకు కరోనా కలకలం: క్వారంటైన్‌కి తరలింపు

మొత్తం పాజిటివ్ కేసుల్లో 448 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు, వలస కార్మికులు ఉన్నారు. కాగా వైరస్‌తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 1,587 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,455 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో  45 మంది వైద్యులకు కరోనా వైరస్ సోకింది. కింగ్ కోఠిలో పనిచేస్తున్న ముగ్గురు శానిటేషన్ సిబ్బందికి కరోనా సోకింది. వీరందరిని క్వారంటైన్‌కి తరలించారు.

గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు పీజీ వైద్యులతో పాటు సీనియర్ ఫ్యాకల్టీకి కూడ కరోనా సోకింది. 10 మంది ఇంటర్న్స్ విద్యార్థులకు కరోనా సోకింది. నిమ్స్ లో పనిచేస్తున్న 8 మంది పీజీ విద్యార్థులకు కరోనా సోకింది.

Also Read:నివేదిక ఇవ్వండి: వైద్య సిబ్బందికి కరోనా, తెలంగాణ హైకోర్టు సీరియస్

కింగ్ కోఠిలో పనిచేస్తున్న ముగ్గురు పారిశుద్య సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఇక్కడ పనిచేసే పారిశుద్య సిబ్బందిని కూడ పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కి తరలించనున్నారు.

తెలంగాణలోని మూడు మెడికల్ కాలేజీల్లోని వైద్య సిబ్బందికి కరోనా వ్యాప్తి చెందింది. దీంతో సుమారు 600 మందిని బుధవారం నాడు అధికారులు తరలించారు. ఈ నెల 20వ తేదీన పీజీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

click me!