స్నేహితుడి భార్యపై కన్ను... అఘాయిత్యానికి పాల్పడి....

Published : Nov 05, 2019, 09:16 AM IST
స్నేహితుడి భార్యపై కన్ను... అఘాయిత్యానికి పాల్పడి....

సారాంశం

పొలానికి వెళ్లిన సదరు మహిళపై మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడి... అనంతరం హత్య చేశాడు...

స్నేహితుడి భార్యపై ఓ వ్యక్తి కన్నేశాడు. స్నేహానికి ద్రోహం చేసి.... స్నేహితుడి భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను అతి దారుణంగా హత్య  చేశాడు. ఈ దారుణ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... జిల్లాలోని బెజ్జంకి మండలం వడ్లూర్‌ గ్రామానికి చెందిన మహిళ ఉదయాన్నే మాదాపూర్‌లోని తమ పొలానికి వెళ్లింది. మరోవైపు.. ఆమె భర్త తన స్నేహితుడు చెక్కిల్ల శ్రీనివా్‌సగౌడ్‌తో కలిసి మధ్యాహ్నం నుంచి వడ్లూర్‌ గ్రామంలోని బెల్ట్‌ షాప్‌లో మద్యం తాగసాగాడు.

సాయంత్రం 4 గంటలకు తన భార్యను తీసుకురమ్మంటూ శ్రీనివా్‌సగౌడ్‌కు ద్విచక్ర వాహనం ఇచ్చి పంపాడు. అప్పటికే మత్తుతో మదమెక్కిన శ్రీనివాస్ గౌడ్‌.. తన స్నేహితుడి భార్యను మొక్కజొన్న చేలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి, అనంతరం గొంతు నులిమి చంపేశాడు. కాగా... పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మద్యం మత్తులో తాను నేరం చేసినట్లు అతను అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. సదరు మహిళ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్
Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu