నా భార్య హత్య వెనుక చాలా మంది హస్తం.. తహసీల్దార్ విజయారెడ్డి భర్త

By telugu teamFirst Published Nov 5, 2019, 8:33 AM IST
Highlights

సోమవారం మధ్యాహ్నం.. విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయా రెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, పెట్రోలు పోసి కాల్చి చంపేశాడు. 

తన భార్య, తహసీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక పెద్ద కుట్ర జరిగి ఉంటుందని ఆమె భర్త సుభాష్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లిన సురేష్ అనే వ్యక్తి...తహసీల్దార్ విజయారెడ్డి పై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సంగతి తెలిసిందే. దీంతో.... ఆమె సజీవదహనమయ్యారు.

తన భార్య దారుణ హత్యకు గురికావడంపై భర్త సుభాష్ రెడ్డి తట్టుకోలేకపోయారు. ఆమె హత్యపై ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. విజయారెడ్డి హత్యకు సురేష్ ఒక్కడే కారణం కాదని ఆయన అన్నారు. ఆమె హత్య వెనకాల చాలా మంది హస్తం ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకేసును సీబీఐకి అప్పగించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. 
AlsoRead tahsildar vijaya reddy: ఏ భూవివాదం లేదు.. నా బిడ్డ మంచోడు: నిందితుడు సురేశ్ తల్లి...

కాగా.... సోమవారం మధ్యాహ్నం.. విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయా రెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, పెట్రోలు పోసి కాల్చి చంపేశాడు. ఆమె మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో మాట్లాడే నెపంతో వచ్చి ఈ దౌర్జన్యానికి ఒడిగట్టాడు. కౌలు రైతుకు, భూ యజమానికి మధ్య తలెత్తిన వివాదంలో ఆమె బలైపోయారు.

AlsoRead tahsildar Vijaya: భూవివాదమే కారణమా, ఎవరీ విజయా రెడ్డి?...

తనకు పట్టా రాదనే ఉద్దేశంతోనే ఆమెను చంపినట్టు కౌలు రైతు సురేశ్‌ చెప్పాడు. మంటలు అంటుకున్న విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌, అటెండర్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. అక్కడే ఉన్న మరో రైతుకు కూడా కాలిన గాయాలయ్యాయి. నిందితుడు సురేశ్‌ కూడా మంటలు అంటుకుని గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!