లాడ్జీలో వివస్త్రగా వివాహిత మృతదేహం... అక్రమ సంబంధమే కారణమా?

Published : Sep 19, 2023, 10:07 AM IST
లాడ్జీలో వివస్త్రగా వివాహిత మృతదేహం... అక్రమ సంబంధమే కారణమా?

సారాంశం

వేములవాడలోని ఓ లాడ్జీలో వివాహిత దారుణ హత్యకు గురయ్యింది. బెడ్ పై వివస్త్రగా పడివున్న మహిళ మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

వేములవాడ : హాయిగా సాగుతున్న జీవితాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నారు. క్షణ కాలం సుఖం కోసం అయినవారిని మోసం చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా  అక్రమ సంబంధాల కారణంగానే ఎన్నో హత్యలు చోటుచేసుకుంటున్నాయి... మరెన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. తాజాగా భర్తను, పిల్లలను కాదని ఇంటినుండి వెళ్లిపోయిన మహిళ ఓ లాడ్జీలో శవంగా తేలింది. ఈ దారుణం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... సిరిసిల్ల పట్టణ సమీపంలోని చంద్రంపేటకు చెందిన రాములుకు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ కు చెందిన వెంకటవ్వతో ఇరవయ్యేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. అయితే  ఇన్నాళ్లు సాఫీగా సాగిన వీరి జీవితాన్ని వివాహేతర సంబంధం నాశనం చేసింది. భర్త, పిల్లలను కాదని ప్రియుడితో వెళ్లిపోయిన వెంకటవ్వ(46) దారుణ హత్యకు గురయ్యింది. 

వేములవాడ పట్టణంలోని ఓ లాడ్జీలో ఆదివారం సాయంత్రం ఓ మహిళ మృతదేహం బయటపడింది. బెడ్ పై నగ్నంగా పడివున్న మహిళ మృతదేహాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. లాడ్జి సిబ్బందిని విచారించగా అంతకు ముందురోజు (శనివారం) మరో వ్యక్తితో కలిసి మహిళ లాడ్జీలో దిగినట్లు తెలిపారు. అయితే అర్ధరాత్రి మహిళతో వచ్చిన వ్యక్తి బయటకు వెళ్లిపోయాడని తెలిపారు. అతడు ఎంతకూ తిరిగిరాకపోవడం, మహిళ గదిలోంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపుతట్టినట్లు తెలిపారు. లోపలినుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బలవంతంగా తలుపు తెరిచి చూడగా బెడ్ పై వివస్త్రగా మహిళ మృతదేహం పడివుందని లాడ్జి సిబ్బంది తెలిపారు. 

Read More  హైదరాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రిలో యువతిపై అత్యాచారం: నిందితుడు షాబాద్ అరెస్ట్

లాడ్జిలో దిగే సమయంలో కేవలం మహిళ ఆదార్ కార్డును మాత్రమే ఇచ్చినట్లు లాడ్జి సిబ్బంది పోలీసులకు తెలిపారు. ఆ ఆధార్ కార్డ్ ఆదారంగా మృతురాలు వెంకటవ్వగా గుర్తించారు. భర్త రాములుకు ఆమె మృతిపై సమాచారం అందించారు. రెండు రోజులుగా భార్య వెంకటవ్వ కనిపించకుండా పోయిందని రాములు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వెంకటవ్వ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల హాస్పిటల్ కు తరలించారు. 

మృతురాలు వెంకటవ్వతో కలిసి లాడ్జీలో దిగిన వ్యక్తి ఫోటోలు సిసి కెమెరాల్లో రికార్డయ్యింది. అతడితో వెంకటవ్వ వివాహేతర సంబంధం కలిగివున్నట్లు అనుమానిస్తున్నారు. అతడే ఈ హత్యకు పాల్పడివుంటాడని అనుమానిస్తున్న పోలీసులు గాలింపు చేపట్టారు. అతడి ఫోటోను విడుదల చేసిన పోలీసులు వివరాలు తెలిస్తే తమకు తెలియజేయాలని కోరారు. 
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే