హైదరాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రిలో యువతిపై అత్యాచారం: నిందితుడు షాబాద్ అరెస్ట్

హైద్రాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రిలో  యువతిపై అత్యాచారానికి పాల్పడిన  నిందితుడు షాబాద్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు.
 

police arrested Shabad for raping  woman  at ESI hospital in Hyderabad lns

హైదరాబాద్: హైద్రాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న రోగి సోదరిపై  అత్యాచారానికి పాల్పడిన షాబాద్ అనే యువకుడిని ఎస్ఆర్‌నగర్ పోలీసులు  మంగళవారంనాడు అరెస్ట్  చేశారు.ఈ నెల  6వ తేదీన  యువతిపై  షాబాద్ అనే యువకుడు  యువతిపై  అత్యాచారానికి పాల్పడ్డాడు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు  నిందితుడి కోసం  గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ  ఉదయం ఎస్ఆర్ నగర్ లో నిందితుడిని అరెస్ట్ చేశారుకర్ణాటక రాష్ట్రానికి చెందిన  యువతి తన సోదరుడు ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో  అతనికి తోడుగా  ఆసుపత్రిలో ఉంటుంది.  ఈ నెల  6వ తేదీన ఆసుపత్రిలో  ఉన్న తన సోదరుడికి  భోజనం తీసుకెళ్లేందుకు  వెళ్లి వస్తున్న సమయంలో  యువతిపై షాబాద్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈఎస్ఐ ఆసుపత్రిలో ఆవరణలోనే  షాబాద్ అనే యువకుడు   బాధితురాలిపై  రెండు దపాలు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫోన్ లో తన సోదరుడికి సమాచారం ఇచ్చింది.  అప్పటికే బాధితురాలి వద్దకు  ఆమె సోదరుడు  వచ్చే సమయానికి నిందితుడు పారిపోయాడు.  బాధితురాలు  ఆసుపత్రి సిబ్బందికి ఈ సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి సిబ్బంది సహాయంతో  పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు విచారణ నిర్వహించారు.  బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడింది  షాబాద్ గా గుర్తించారు. నిందితుడి కోసం  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఇవాళ  ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాబాద్ ఉన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.  రిమాండ్ కు తరలించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios