మహిళతో శృంగారం: వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

Published : Jun 02, 2018, 10:38 AM IST
మహిళతో శృంగారం: వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

సారాంశం

ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగించి చిక్కుల్లో పడింది.

హైదరాబాద్: ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగించి చిక్కుల్లో పడింది. ఓ కీచకుడు ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించి, ఆమెకు తెలియకుండా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆ వ్యక్తిపై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

 యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన వివాహిత, దిల్‌షుక్‌నగర్‌ పీ అండ్‌ టీ కాలనీలో భర్తతో కలిసి నివాసం ఉంటోంది. అయిదు నెలల క్రితం ఇందిరానగర్‌కు చెందిన ఏవీ.సుబ్బారావు అనే వ్యక్తితో ఆమెకు ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. 

ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. సుబ్బారావు ఆమె వద్ద రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు ఇవ్వాలని ఆమె అడగడం ప్రారంభించింది. డబ్బులు ఇవ్వాలని అడిగితే నగ్న వీడియోలు బయట పెడతానని బెదిరించాడు. 

దానికితోడు మరింత డబ్బు కావాలంటూ ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయసాగాడు. శుక్రవారం ఉదయం ఆమెకు ఫోన్‌ చేసి మరో రూ.5 లక్షలు ఇవ్వాలని, లేకపోతే వీడియోలను నీ భర్తకు పంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్