తన మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని కొట్టి చంపిందో మహిళ. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో వెలుగు చూసింది.
హైదరాబాద్ : శుక్రవారం తెల్లవారుజామున రాజేంద్రనగర్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంటి ముందు నిద్రిస్తున్న మహిళపై లైంగిక దాడికి యత్నించాడో వ్యక్తి. అతడిని అడ్డుకునే క్రమంలో రాడ్డుతో కొట్టి చంపింది ఆ మహిళ. ఓ కూలీ దంపతులు రాత్రివేళ ఇంటిముందు నిద్రిస్తుండగా.. అటుగా వెడుతున్న ఓ వ్యక్తి.. మద్యం మత్తులో ఆమె మీద అఘాయిత్యానికి ప్రయత్నించాడు.
దుండగుడి నుండి తనను తాను రక్షించుకోవడానికి, 45 ఏళ్ల ఆ మహిళ అతడిని ప్లాస్టిక్ పైపుతో కొట్టింది. అతని ప్రైవేట్ భాగాలలో తన్నింది. దీంతో అతనికి ప్రాణాంతక గాయాలయ్యాయి. అత్యాచారయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి రాజేంద్రనగర్‌లోని చాకలి బస్తీకి చెందిన సెక్యూరిటీ గార్డు శ్రీనివాస్ (46)గా గుర్తించారు. మహిళ దాడి చేయడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే నేలపై కుప్పకూలిపోయాడు. మద్యం మత్తులో ఉన్న ఆమె భర్త కూడా గొడవకు నిద్రలేచాడు. ఆ సమయంలోనే ఇరుగుపొరుగు వారు కూడా అక్కడికి చేరుకున్నారు.
undefined
ఘర్ వాపసీ : సొంత గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్.. కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖాయం... !!
డయల్ 100లో అలర్ట్ రావడంతో పోలీసు బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. "శ్రీనివాస్ అపస్మారకంలో ఉన్నాడు. అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాం. ఆసుపత్రిలో అతను చనిపోయినట్లు తెలిపారు. అంతర్గత గాయాల కారణంగా అతను చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నాం" అని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ బి నాగేంద్ర బాబు తెలిపారు.
అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. "మహిళ, ఆమె భర్త, పొరుగువారి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేస్తాం. ఆ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీని కూడా పరిశీలిస్తాం. సేకరించిన ఆధారాల ఆధారంగా, దర్యాప్తును కొనసాగిస్తాం" అని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.
గురువారం రాత్రి పీకలదాకా కల్లు తాగిన శ్రీనివాస్ శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి బయలు దేరి వెళ్లాడని పోలీసులు తెలిపారు. చాకలి బస్తీ సందుల గుండా వెడుతుండగా, ఇంటి బయట నిద్రిస్తున్న మహిళను శ్రీనివాస్ గమనించాడు.
శ్రీనివాస్ దగ్గరకు వచ్చి ఆమె చీరను లాగాడు. దీంతో ఒక్కసారిగా మేల్కొన్న మహిళ.. అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోయింది. అప్పుడు అతను ఆమె పాదాల దగ్గర కనిపించాడు. ఆమె వెంటనే సమీపంలోని పైపును అందుకుని దుండగుడిపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు.
(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి గోప్యతను కాపాడేందుకు బాధితురాలి గుర్తింపును వెల్లడించలేదు)