తెలంగాణ స్కూల్స్‌లో నాలుగో శనివారం ‘‘నో బ్యాగ్ డే’’.. విద్యార్థులతో ఏం చేయిస్తారంటే..

Published : Jun 24, 2023, 10:10 AM ISTUpdated : Jun 24, 2023, 10:14 AM IST
తెలంగాణ స్కూల్స్‌లో నాలుగో శనివారం ‘‘నో బ్యాగ్ డే’’.. విద్యార్థులతో ఏం చేయిస్తారంటే..

సారాంశం

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పాఠశాలలను విద్యార్థులకు మరింత ఆహ్లాదకరంగామార్చేందుకు ప్రతినెలా నాలుగో శనివారాన్ని ‘‘నో బ్యాగ్‌ డే’’ అమలు చేయాలని ఆదేశించింది.

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు పాఠశాలలను మరింత ఆహ్లాదకరంగామార్చేందుకు పాఠశాల విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ప్రతినెలా నాలుగో శనివారాన్ని ‘‘నో బ్యాగ్‌ డే’’ అమలు చేయాలని ఆదేశించింది. విద్యార్థులపై ఒత్తిడి, బ్యాగుల భారాన్ని తగ్గించడంలో భాగంగా.. ప్రతి నాలుగో శనివారం నో బ్యాగ్‌ డే‌గా అమలు  చేయనున్నారు.  స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ) 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల 10 బ్యాగ్‌లెస్ డేస్ కోసం హ్యాండ్‌అవుట్‌తో ముందుకు వచ్చింది. ఇందులో ప్రతి నాలుగో శనివారం ఏ కార్యకలాపాలు చేపట్టాలో పేర్కొంది.వీటిలో 28 రకాలైన కార్యకలాపాలుండగా, వీటిలో వీలును బట్టి వినియోగించుకొనే అవకాశం కల్పించారు. 


ఇందులో మ్యూజియంలు, చారిత్రక ప్రదేశాలు, గ్రామ పంచాయితీల వంటి  కార్యాలయాల సందర్శన, సైన్స్ ప్రయోగాలు, డూడ్లింగ్, మోడల్ అసెంబ్లీ, మోడల్ ఎన్నికలు వంటి ఇండోర్ కార్యకలాపాలు, పాఠశాలల్లో పలు అంశాలు నేర్చుకోవడం వంటివి ఉన్నాయి. దీని ప్రకారం.. ప్రైమరీ విభాగానికి షో టైమ్, ఫన్ స్టేషన్,  క్రియేటివ్ సర్కిల్ అనే మూడు సెషన్‌లు ఉంటాయి.  1, 2వ తరగతి విద్యార్థులు తమ కుటుంబం గురించి మాట్లాడమని, కుటుంబ సభ్యులలో ఒకరిని అనుకరించాలని, కమ్యూనికేషన్ స్కిల్స్, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో ఈ సెషన్‌లలో భాగంగా కుటుంబ సభ్యుని స్కెచ్‌ని గీయమని అడగబడతారు.

3 నుంచి 5వ తరగతి విద్యార్థుల కోసం కార్యాచరణ-ఆధారిత అభ్యాసంలో భాగంగా.. జీవనోపాధిపై ఒక థీమ్ రూపొందించబడింది. ఇక్కడ వారు వృత్తిలో ఉపయోగించే సాధనాలను గీయడంతోపాటు వారికి నచ్చిన వృత్తిపై మాట్లాడటానికి, పని చేయమని అడగబడతారు.

సెకండరీ స్థాయి ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థులకు.. కుటుంబ బడ్జెట్ సర్వేతో పాటుగా పోస్ట్ ఆఫీస్, నిర్మాణ స్థలాలు, రేషన్ షాపుల సందర్శనతో సహా ఫీల్డ్ విజిట్‌లు, మోడల్ అసెంబ్లీ, మోడల్ ఎన్నికలు, అవుట్ డోర్, ఇండోర్ కార్యకలాపాలు ఉన్నాయి. అంతేకాకుండా.. సెకండరీ పాఠశాల స్థాయి విద్యార్థులకు కృత్రిమ మేధస్సు, దాని అప్లికేషన్లు, కెరీర్ అవకాశాల ప్రాథమిక అంశాలు కూడా పరిచయం చేయబడతాయి.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు