మంచిర్యాలలో దారుణం.. ప్రియుడి మోజులో పడి.. భర్తను హత్య చేసిన భార్య.. 

Published : Aug 10, 2023, 09:13 PM IST
మంచిర్యాలలో దారుణం.. ప్రియుడి మోజులో పడి.. భర్తను హత్య చేసిన భార్య.. 

సారాంశం

వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవాడిని కడతేర్చుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మంచిర్యాల జిల్లాలలో వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్నవాడిని హంతమొందించింది. 

వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. పరాయి వారిపై  మోజులోపడి కట్టుకున్న వారిని మట్టుబెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్నవాడిని కడతేర్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం అచ్చులాపూర్ కు చెందిన సిద్దం శ్రీనివాస్, బానక్కలు కూలీ పనులు చేసుకుంటూ తమ సంసారాన్ని సాగిస్తున్నారు. ఈ సమయంలో తాండూర్ కు చెందిన మేడి శంకర్ అనే వ్యక్తితో బానక్కకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త బలపడి.. వివాహేతర సంబంధంగా మారింది.

ఈ విషయం తెలుసుకున్న భార్త శ్రీనివాస్ మనస్తానికి గురయ్యారు. తన భార్య ప్రవర్తనను మార్చుకోవాలని వారించే వాడు. కానీ, బానక్క ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో శ్రీనివాస్ మద్యానికి బానిసగా మారారు. ఈ తరుణంలో మంగళవారం కూలిపనులకు వెళ్లిన శ్రీనివాస్ రాత్రి అయినా ఇంటికి రాలేదు. రాత్రి 9-30 ప్రాంతంలో గోపాల్ నగర్ క్రాస్ రోడ్డు సమీపంలో శ్రీనివాస్ పుల్ గా మద్యం సేవించి పడిపోయినట్టు అచ్చులాపూర్ చెందిన వ్యక్తి శ్రీనివాస్ కూమారుడికి పోన్ చేసి తెలిపాడు.

బుధవారంఉదయం గోపాల్  నగర్ శివారు పాంత్రం మల్లన్నగుట్ట వద్ద శ్రీనివాస్ శవం కనిపించింది. మ్రుతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని తన ప్రియుడు శంకర్ తో కలిసి బానక్క హత్య చేసినట్టు పొలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఎవరికీ అనుమానం కాకుండా.. బురుదలో శవాన్ని పడేసి వెళ్లినట్టు పోలీసులు తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్